విరాట్ కోహ్లీతో అందమైన అమ్మాయి.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో దిగిన ఓ అందమైన అమ్మాయి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించేలా ఉన్న ఆ అమ్మాయి అందానికి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ కుందనపు బొమ్మ ఎవరా? అని తెగ హైరానా పడుతున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ.. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌కు సెల్ఫీలు ఇస్తూ సరదాగా గడిపాడు. నిన్ననే కాదు.. గత కొన్ని రోజులుగా విరాట్ ఫ్యాన్స్‌ను సంతోష పరుస్తూనే ఉన్నాడు. ఇలా ఓ అమ్మాయి విరాట్‌తో దిగిన ఫొటోనూ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఒక్క ఫొటోతో సెన్సేషన్..
అంతే ఆమె కలలో కూడా ఊహించని రెస్పాన్స్ ఆ ఫొటోకు వచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు సైతం ఒక్కసారిగా పెరిగిపోయారు. విరాట్‌తో ఆ అమ్మాయి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. భారతీయురాలైన ఆ అమ్మాయి చాలా అందంగా ఉండటంతో ఆ ఫొటో నెట్టింటిని షేక్ చేసింది. దాంతో నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరా? అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఆ అందమైన అమ్మాయి పేరు అమీషా బసేరా.. అని, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో చదువుకుంటోందిని, చదువుకుంటూనే మోడల్‌గా పని చేస్తుందనే వివరాలు తెలుసుకున్నారు.

ఆరాధ్య దైవం అంటూ..
బ్రిస్బేన్‌లో సోమవారం భారత క్రికెటర్లను కలిసిన ఆ బ్యూటీ.. కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దానికి'ఇవాళ నా ఆరాధ్య వ్యక్తి, నా లవ్, నా మనిషి విరాట్ కోహ్లీని కలిశాను. థాంక్యూ సోమచ్'అంటూ కోహ్లీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అమీషా.. మాటలకు అందనిది అంటూ కోహ్లీతో కలిసిన సందర్భాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంది. దాంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయ్యింది. వైరల్ కావడమే కాదు.. ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్లు గణనీయంగా పెరిగారు.

అందానికి అభిమానులు ఫిదా..
కోహ్లీ ఫొటోను పోస్టు చేయక ముందు ఆమెకు వెయ్యి మంది ఫాలోవర్లు ఉండగా.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమెను అనుసరిస్తోన్న వారి సంఖ్య 15 వేలు దాటింది. అమీషా బసేరా అందంగా ఉండటంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అమీషా అందానికి ఫిదా అవుతున్నామని కామెంట్ చేస్తున్నారు. అసలు అమీషా బసేరా ఎవరు..? ఆమె కోహ్లీ ఫ్యానేనా.. అని విరాట్ అభిమానులు ఆరా కూడా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కోహ్లీ అంటే చాలా ఇష్టమనే విషయాన్ని అభిమానులు గ్రహించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2016 నుంచి కోహ్లీ ఫొటోలను పోస్టు చేస్తోందని విరాట్ అభిమాని ఒకరు.. ట్వీట్ చేశారు.
అనుష్క.. జాగ్రత్త..
కోహ్లీతో కలిసి ఆమె దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో విరాట్ ఫ్యాన్స్ కొందరు సరదాగా స్పందిస్తున్నారు. కోహ్లి భయ్యా జాగ్రత్త.. ఈ ఫొటో గనుక అనుష్క వదిన చూసిందా ? ఇక అంతే అంటూ ఫన్నీగా ట్వీట్ చేస్తున్నారు. కొందరు అయితే అనుష్క శర్మను హెచ్చరిస్తున్నారు కూడా. సవతి వచ్చేలా ఉంది.. కోహ్లీని జాగ్రత్తగా చూసుకో అని అడ్వైజ్ ఇస్తున్నారు. అప్పట్లో ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఫుల్ సపోర్ట్ చేసిన దీపికా ఘోస్ అనే అమ్మాయి కోహ్లీకి వీరాభిమాని. ఇప్పుడు అమీషా వచ్చి చేరిందని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్క ఫొటోతో అమీషా బసేరా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications