Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగోడి ప్లేస్‌కే ఎసరు పెట్టాడు..ఎవరీ శుభదీప్ ఘోష్?

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలిప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే పదవి కాలం ముగిసిందని, వారి స్థానాల్లో కొత్త కోచ్‌లను నియమిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. దాంతో కొత్త కోచ్‌లు ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. టీమిండియా తదుపరి అసిస్టెంట్ కోచ్ ఎవరా? అనేది తెలియకపోయినప్పటికీ.. ఫీల్డింగ్ కోచ్‌గా దేశవాళీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు తేజం టీ దిలిప్ స్థానాన్ని ఘోష్‌తో బీసీసీఐ భర్తీ చేయనుంది.

IND vs SL: 33 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు.. ఎవరీ సారాన్ష్ జైన్?

IND vs SL: 33 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు.. ఎవరీ సారాన్ష్ జైన్?

ప్రస్తుతం శుభదీప్ బీసీసీఐ సెంట్రల్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో కోచ్‌గా సేవలందిస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో కూడా అతను టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. మరో రెండు రోజుల్లో శుభ‌దీప్ ఘోష్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కోచ్‌ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

Who Is Shubhadeep Ghosh Meet the Former Assam Cricketer Set to Replace T Dilip as India s Fielding Coach

ఎవరీ శుభదీప్ ఘోష్..?

శుభ‌దీప్ ఘోష్‌ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. అతను అస్సాంతో పాటు రైల్వే‌స్ టీమ్‌కు మిడిలార్డర్ బ్యాటర్‌గా.. ఆఫ్ స్పిన్నర్‌గా సేవలందించాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో 17 చొప్పున మ్యాచ్‌లు ఆడాడు. 2004లో ఘోష్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగా.. మరుసటి ఏడాది లిస్ట్-ఏ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

గత 15 ఏళ్లుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఎన్‌సీఏలో ఎంతో మంది జూనియర్, సీనియర్ ఆటగాళ్లకు మార్గదర్శిగా వ్యవహరించాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. 2023 ఆసియా గేమ్స్‌లోనూ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు.

గౌతమ్ గంభీర్ టీమ్‌లో భారీ మార్పులు.. ఆ ఇద్దరూ ఔట్!

గౌతమ్ గంభీర్ టీమ్‌లో భారీ మార్పులు.. ఆ ఇద్దరూ ఔట్!

అండర్ 19 ప్రపంచకప్‌తో..

అండర్ 19 ప్రపంచకప్ 2024లోనూ భారత కుర్రాళ్ల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. భారత ఏ జట్టు తరఫున కూడా పలు పర్యటనల్లో కోచ్‌గా భాగమయ్యాడు. ఐపీఎల్ 2014 సీజన్‌లో విజేతగా నిలిచిన కేకేఆర్‌కు కూడా శుభ‌దీప్ ఘోష్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. గత కొద్ది రోజులుగా భారత ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. శుభదీప్ ఘోష్ రాకతో భారత ఫీల్డింగ్ మెరుగవుతుందని నెటిజన్లు ఆశిస్తున్నారు.

Story first published: Wednesday, July 29, 2026, 14:01 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+