For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శార్దూల్ ఠాకూర్ పెళ్లి చేసుకున్న మిథాలీ పారుల్కర్ ఎవరో తెలుసా?

Who is Shardul Thakur Wife? Check Pics and know all Details

ముంబై: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన ప్రేయసి మిథాలీ పారుల్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. సోమవారం ముంబైలో శార్దూల్ వివాహం ఘనంగా జరిగింది. కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో రెండేళ్ల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్న శార్దూల్-మిథాలీ.. సోమవారం ఆ పనిని కూడా పూర్తి చేశారు. ఇక శార్దూల్ సతీమణి మిథాలీ పార్కర్‌ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరు? ప్రొఫెషన్ ఏంటని, శార్దూల్‌‌కు ఎలా పరిచయమైందనే వివరాలు ఆరా తీస్తున్నారు.

మిథాలీ పారుల్కర్ ఓ వ్యాపారవేత్త. మహారాష్ట్రలోని థానేలో ఆమె 'ఆల్‌ ది జాస్‌.. లగ్జరీ బేకర్స్‌' పేరిట ఓ బేకరీ సంస్థను స్థాపించారు. ముంబైలోనూ ఈ సంస్థకు బ్రాంచ్‌లు ఉన్నాయి. 2020 ఫిబ్రవరిలో ఈ సంస్థను ప్రారంభించిన మిథాలీ.. అదే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను మొదలుపెట్టి సేవలు అందిస్తోంది. వివిధ రకాల కేక్‌లు, కుకీస్‌, బ్రెడ్‌ తదితర బేకరీ ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్ లైన్ వేదికగా ఈ సంస్థ విక్రయిస్తోంది. వ్యాపారాన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే మిథాలీ పారుల్కర్ మంచి పేరును సంపాదించింది.

Who is Shardul Thakur Wife? Check Pics and know all Details

శార్దూల్ ఠాకూర్‌తో నిశ్చితార్థం అనంతరం ఆమె క్రేజ్‌ భారత్ మొత్తానికి విస్తరించింది. 1992లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ పెద్ద కుటుంబంలో మిథాలీ పారుల్కర్ జన్మించారు. ఆమె విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 2014లో మిథీబాయ్‌ కాలేజీ నుంచి ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 2015లో ఉద్యోగ జీవితం మొదలుపెట్టిన మిథాలీ.. మల్టీనేషనల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఆ తర్వాత 2017లో బ్లూస్టార్‌ డైమండ్స్‌లో కంపెనీ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.

Who is Shardul Thakur Wife? Check Pics and know all Details

2018 అక్టోబరు వరకు అందులోనే పని చేసిన మిథాలీ.. 2019లో చేతక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ‌లో చేరి సెక్రెటరీగా పని చేశారు. 2020 వరకు ఆ సంస్థలో ఉన్న ఆమె మోడలింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపింది. కానీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ రంగాన్ని వదిలేసి బేకరి ఉత్పత్తుల కంపెనీని స్థాపించి వ్యాపారం చేస్తోంది. థానేలో చదువుకుంటున్న రోజుల్లోనే శార్దూల్‌ ఠాకూర్‌తో మిథాలీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులు అంటే మిథాలీకి చాలా ఇష్టం.

Story first published: Tuesday, February 28, 2023, 15:38 [IST]
Other articles published on Feb 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+