Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆసీస్ జట్టులోకి 19 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ కొన్‌స్టాస్?

భారత్‌తో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్ట్‌లకు ఆస్ట్రేలియా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఆ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోతుంది. భారత్‌తో సిరీస్‌లో తొలి మూడు టెస్ట్‌ల్లో నాథన్ మెక్‌స్వీనికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా అతను దారుణంగా విఫలమయ్యాడు.

ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన మెక్‌స్వీని ఐదు ఇన్నింగ్స్‌ల్లో 14.42 సగటుతో 72 పరుగులే చేశాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ జస్‌ప్రీత్ బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో అతన్ని చివరి రెండు టెస్ట్‌లకు తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ అనే కొత్త ఆటగాడికి అవకాశామిచ్చింది.

Who is Sam Konstas 19-year-old Australian opener set for IND vs AUS Boxing Day Test debut

ఎవరీ కొన్‌స్టాస్..?
మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌లో ఈ 19 ఏళ్ల కుర్రాడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే గత 70 ఏళ్లలో ఆసీస్ తరఫున అరంగేట్ర చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా సామ్ కొన్‌స్టాస్ చరిత్రకెక్కనున్నాడు. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఈ కొత్త కుర్రాడి గురించి తెలుసుకునేందుకు భారత అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

భారత్‌పై శతకం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కొన్‌స్టాస్ 73 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత భారత జట్టుతో జరిగిన పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ 107 పరుగులతో సత్తా చాటాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సెంచరీ చేసి ఆసీస్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కొన్‌స్టాస్ 42.23 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం కొనస్టాస్ ప్రత్యేకత.

Who is Sam Konstas 19-year-old Australian opener set for IND vs AUS Boxing Day Test debut

సమంగా ఇరు జట్లు..
సామ్ కొన్‌స్టాస్ బ్యాటింగ్‌లో వైవిధ్యం కనిపించడంతోనే అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించగా.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్‌ టెస్ట్‌లో ఆసీస్ గెలుపొందింది.

గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిని తప్పించుకుంది. చివరి రెండు టెస్ట్‌లు గెలిచిన జట్టే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025 ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

చివరి రెండు టెస్ట్‌లకు ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

Story first published: Saturday, December 21, 2024, 10:35 [IST]
Other articles published on Dec 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+