Sachin Das: అండర్ 19 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న పోలీస్ బిడ్డ..!
భారత అండర్ 19 స్టార్ సచిన్ దాస్ క్రికెట్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సచిన్ దాస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో కెప్టెన్ ఉదయ్ సహరన్‌తో కలిసి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 4 పరుగుల దూరంలో శతకాన్ని చేజార్చుకున్నా.. ఐదో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయానికి బాటలు వేసాడు.
బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో ఈ యువ సచిన్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ అండర్ 19 యువ కెరటం మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించాడు. అతని తండ్రి సంజయ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడారు.

దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్ ఆరాదించేవాడు. దాంతో అతనికి సచిన్ అనే పేరు పెట్టాడు. సచిన్ దాస్ పుట్టకముందే కొడుకుపుడితే క్రికెటర్‌ను చేయాలని సంజయ్ దాస్ కలలు కన్నాడు. దాంతోనే సచిన్ దాస్‌ను క్రికెటర్ చేసేందుకు సంజయ్ దాస్ తెగ కష్టపడ్డాడు. కొడుకు ప్రాక్టీస్ కోసం అప్పు చేసి మరీ టర్ఫ్ పిచ్‌ను తయారు చేయించాడు.
పిచ్‌పై నీళ్లు చల్లేందుకు వాటర్ ట్యాంక్‌ను పిలిపించేవాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కొల్హాపుర్ టస్కర్స్ తరఫున సచిన్ దాస్ అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా భారీ సిక్సర్లు బాదడం.. అతనికి అండర్ 19 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేలా చేసింది. సచిన్ దాస్ తల్లి సురేఖ దాస్ మహారాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆమె మాజీ కబడ్డీ ప్లేయర్ కూడా. సచిన్ దాస్ సోదరి ప్రతీక్షా యూఎస్‌పీసీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఇక అండర్ 19 ప్రపంచకప్‌లో సచిన్ దాస్ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని కన్నా ముందు కెప్టెన్ ఉదయ్(389) ముషీర్ ఖాన్(338) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications