Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rachin Ravindra: ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు? అనంతపురంతో లింక్ ఏంటి?

అహ్మదాబాద్: న్యూజిలాండ్ యువ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర దుమ్మురేపాడు. తన తొలి వన్డే ప్రపంచకప్‌‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్యంగా ప్రమోషన్ అందుకున్న రచిన్ రవీంద్ర అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో ధాటిగా ఆడుతున్న హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడు.

Who Is Rachin Ravindra

ఈ ప్రదర్శనతో రచిన్ రవీంద్ర.. టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా రచిన్ రవీంద్ర పేరు మారుమోగుతోంది. అసలు ఈ రచిన్ రవీంద్ర ఎవరూ..? అతనికి భారత్‌తో ఉన్న సంబంధం ఏంటనే విషయంపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

అది కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 18 టీ20లు, 13 వన్డే మ్యాచ్‌లు ఆడిన రచిన్ రవీంద్ర 26 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలాంటి రచిన్ రవీంద్ర ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శతకంతో కదం తొక్కి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.

భీకర బౌలింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్‌ జట్టును తన బ్యాటింగ్‌తో చిత్తు చేశాడు. ఇదే ఇప్పుడు అతన్నీ స్పెషల్‌గా నిలబెట్టింది. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర స్వస్థలం భారత్‌లోని బెంగళూరు. అతని తల్లిదండ్రులు 1990లోనే న్యూజిలాండ్‌కు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర.. క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది మాత్రం భారత్‌లోనే.

ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌(ఆర్‌డీటీ)కు వచ్చి రచిన్ క్రికెట్ ఆడుతుండేవాడు. తన తండ్రి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరఫున ఆడేవాడు.

రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌ను అభిమానించే తన తల్లిదండ్రులు వారిద్దరి పేర్లు కలిసేలా రచిన్ అనే పేరు పెట్టారని రచిన్ రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని వెల్లడించాడు.

Story first published: Friday, October 6, 2023, 0:10 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+