For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నితీష్ కుమార్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్.. ఫేవరేట్ హీరో ఎవరంటే..?

ఆస్ట్రేలియా గడ్డపై అసాధారణ శతకంతో చెలరేగిన టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచ క్రికెట్‌లో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఘోర ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీష్ టీమిండియాను ఆదుకున్నాడు. నాటకీయ పరిణామాల మధ్య అతను సాధించిన సెంచరీ ఈ ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే హైలైట్‌గా నిలిచింది.

ప్రేక్షకుల స్టాండ్స్‌లో తన తండ్రి ముత్యాల రెడ్డి చూస్తుండగా.. ఉత్కంఠ పరిస్థితుల మధ్య టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ సాయంతో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ అద్భుత శతకంతో నితీష్ కుమార్ రెడ్డి పేరు మారుమోగుతోంది. అతని తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం కూడా చర్చనీయాంశమైంది.

Who Is Nitish Kumar Reddy s Girlfriend and Favourite Hero

తన కొడుకును క్రికెటర్‌గా మార్చేందుకు ముత్యాల రెడ్డి పడ్డ కష్టం అందర్నీ ఆకట్టుకుంటుంది. కొడుకు‌ను క్రికెటర్ చేయాలనే లక్ష్యంతో ముత్యాల రెడ్డి 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసాడు. అప్పుల్లో కూరుకుపోయి ఎన్నో కష్టాలు పడ్డారు. నితీష్ సెంచరీ చేసిన క్షణం ఇవన్నీ గుర్తుకొచ్చాయో ఏమో కానీ అతను కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ముత్యాల రెడ్డి భావోద్వేగం టీవీల ముందున్న ప్రతీ ఒక్కరిని కంటతడిపెట్టించింది.

గర్ల్ ఫ్రెండ్ ఎవరు..?
నితీష్ కుమార్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడంతో అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి నితీష్ కుమార్ రెడ్డికి గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు. అతను క్రికెట్‌ను మాత్రమే ప్రేమిస్తున్నాడు. 21 ఏళ్ల వయసులోనే ఉన్న నితీష్ కుమార్ రెడ్డి.. ఇంకా ఏ అమ్మాయి మోజులో పడలేదు. భవిష్యత్తులో ఎవరైనా వస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతం అతను తన కుటుంబాన్ని, క్రికెట్‌ను మాత్రమే ప్రేమిస్తున్నాడు.

Who Is Nitish Kumar Reddy s Girlfriend and Favourite Hero

ఫేవరేట్ హీరో ఎవరంటే..?
క్రికెట్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి సినిమా లవర్. అతను తెలుగు సినిమాలనే ఎక్కువగా చూస్తాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే అతనికి పిచ్చి. ఈ విషయాన్ని నితీష్ కుమార్ రెడ్డే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్బంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను షేర్ చేసి.. డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని క్యాప్షన్ ఇచ్చాడు.

నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డికి మహేశ్ బాబు తండ్రి, దివంగత కృష్ణ అంటే చాలా ఇష్టం. దాంతో మహేశ్ బాబు సినిమాలను ఎక్కువగా చూసిన నితీష్ అతనికి పెద్ద అభిమాని అయ్యాడు.

Story first published: Sunday, December 29, 2024, 8:51 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+