Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రిటీష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ ఒకరినొకరు ఫాలో చేసుకుంటుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

ఇటీవలే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని పేర్కొన్నారు.

Who is Jasmin Walia Hardik Pandya rumoured to be dating British singer after Natasa Stankovic divorce

నటాషాతో విడాకులు..
'నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే. ఆగస్త్య మా ఇద్దరితోనూ ఉంటాడు. అతని సంతోషం కోసం సహ తల్లిదండ్రులా మేం అండగా ఉంటాం.

ఈ కష్టమైన సమయంలో మా గోప్యతకు సహకరించాలని, మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం'అని హార్దిక్, నటాషా ట్యాగ్ లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యాతో కలిసి ముంబైని వదిలి సొంత దేశం సెర్బియా వెళ్లిపోయింది. ఇక విడాకులు తీసుకున్నా.. సోషల్ మీడియా వేదికగా ఈ జోడీ యాక్టీవ్‌గానే ఉంటుంది. నటాషా పోస్ట్‌లకు హార్దిక్ పాండ్యా లైక్ చేయడంతో పాటు కామెంట్ చేస్తున్నాడు.

Who is Jasmin Walia Hardik Pandya rumoured to be dating British singer after Natasa Stankovic divorce

గ్రీస్‌లో పాండ్యా..
టీ20 ప్రపంచకప్ 2024 అనంతం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయిన హార్దిక్ పాండ్యా.. శ్రీలంక పర్యటన‌లో టీ20 సిరీస్ మాత్రమే ఆడాడు. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గ్రీస్‌లో ఉన్నాడు. అక్కడే విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు. తన హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ ముందు నడుస్తున్న వీడియో‌ను హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

ఈ వీడియోకు బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే ప్లేస్ లో వాలియా కూడా ఫొటో దిగి ఇన్ స్టాలో షేర్ చేయగా.. ఈ పోస్టుకు పాండ్యా లైక్ కొట్టాడు. గతంలోనూ వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసే విహారయాత్రకు వెళ్లారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Who is Jasmin Walia Hardik Pandya rumoured to be dating British singer after Natasa Stankovic divorce

జాస్మిన్ వాలియా ఎవరంటే..?
బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ వాలియా నటి, సింగర్, యూట్యూబర్.. నివాసం ఇంగ్లండ్‌లోని ఎసెక్స్. టీవీ షోలు, రియాల్టీ షోల ద్వారా చాలా పాపులర్ అయ్యింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు ఆల్బమ్‌లు చేసింది. ఆమె పాడిన 'బామ్ డిగీ' పాటను బాలివుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్ సింగర్ ఆసిమ్ రియాజ్ తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది.

Story first published: Wednesday, August 14, 2024, 12:40 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+