Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Himanshu Sangwan: ఎవడ్రా వీడు? కోహ్లీనే క్లీన్ బౌల్డ్ చేశాడు! (వీడియో)

హిమాన్షు సంగ్వాన్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీకి ఈ యువ పేసర్ ఊహించని షాకిచ్చాడు. స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి కింగ్ కోహ్లీకి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు. దాంతో ఈ యువ పేసర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.

అందుబాటులో ఉన్న స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ రూల్ పెట్టడంతో విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌తో కోహ్లీ 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి రోజు కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కోహ్లీ కోసం ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తారు. అంతర్జాతీయ మ్యాచ్ తరహాలోనే భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Who is Himanshu Sangwan Who Clean-Bowled Virat Kohli on Ranji Trophy return

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టగా.. కోహ్లీ నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. 15 బంతులు ఆడిన కోహ్లీ ఓ ఫోర్ సాయంతో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. హిమాన్షు సంగ్వాన్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి.. ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి ఆఫ్ సైడ్ వికెట్‌ను లేపిసింది. ఈ డెలివరీకి కోహ్లీ స్టన్ అయ్యాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.

వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేయడంతో హిమాన్షు సాంగ్వాన్ పేరు మారుమోగుతోంది. అతను ఎవరా? అని నెటిజన్లు గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీకే చెందిన హిమాన్షు సాంగ్వాన్ దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత 6 ఏళ్లుగా ఆ జట్టుకు ఆడుతున్నప్పటికీ చాలా తక్కువ మ్యాచ్‌ల్లో అవకాశాలు అందుకున్నాడు. ఇప్పటి వరకు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హిమాన్షు సాంగ్వాన్.. 40 ఇన్నింగ్స్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 19.92, ఎకానమీ 30.2గా ఉంది. 17 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసాడు. దేశవాళీ టీ20ల్లో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

అతను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా టికెట్ కలెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీయడం ద్వారా హిమాన్షు తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Story first published: Friday, January 31, 2025, 15:19 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+