Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపక్ చాహర్ ప్రేయసి ఎవరో తెలుసా?

Who is CSK pacer Deepak Chahar’s girlfriend?

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసికి ప్రపోజ్ చేసి, ఆమెతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీస్ గ్యాలరీకి వెళ్లిన దీపక్ చాహర్ అక్కడున్న తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. సినిమా స్టైల్లో మొకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే జేబులో నుంచి రింగ్ తీసి ఆమె చేతికి పెట్టాడు. అనంతరం మరో రింగ్ ఇచ్చి తన చేతికి పెట్టుకున్నాడు. ఇదంతా టీవీ లైవ్‌లో ప్రసారమైంది. దాంతో నెటిజన్లు దీపక్ చాహర్ ప్రేయసి ఎవరా? అని ఆరాతీయడం మొదలుపెట్టారు.

ఇంతకీ ఆమె ఎవరంటే..?

ఇంతకీ ఆమె ఎవరంటే..?

దీపక్ చాహర్ ప్రేయసి పేరు జయ భరద్వాజ్. బిగాబాస్ 5 (హిందీ) కంటెస్టెంట్, స్పిట్స్‌విల్లా 2 కంటెస్టంట్ అయిన నటుడు సిద్దార్థ్ భరద్వాజ్ సోదరి. సుదీర్ఘ కాలంగా వీరిమధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు నెలలుగా వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీపక్ చాహర్‌తో కలిసే ఆమె యూఏఈకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జయ భరద్వాజ్ చెన్నై సూపర్ కింగ్స్‌ బయో బబుల్‌లోనే ఉంటుంది. ఇక ఆమె ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఫ్యామీలీ గ్యాలీరికి వచ్చిన దీపక్ చాహర్.. ఏం తెలియనట్టూ కొద్దిసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత ధోనీ కూతురు జీవాను పక్కకు జరుపుతూ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. దాంతో పక్కనున్న వారంత అవాక్కయ్యారు. హోహో అంటూ చప్పట్లతో అభినందించారు. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ జోడీని ఆశీర్వదించారు. ఇక కామెంటేటర్లు సైతం ఈ జోడి బాగుండాలని దీవించారు. దీపక్ చాహర్‌కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చెన్నై అభిమానులు చాహర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన మూమెంట్ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను చాహర్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.

చెన్నై చిత్తు..

చెన్నై చిత్తు..

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓ వికెట్ తీసినప్పటికీ దీపక్ చాహర్ (1/48) కూడా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో విజయాన్నందించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, షమీ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్.. కేఎల్ రాహుల్ విధ్వంసానికి 13 ఓవరల్లో 4 వికెట్లకు 134 పరుగులు చేసి 42 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసాడు.

Story first published: Thursday, October 7, 2021, 23:06 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+