Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Akash Deep: ఎవడ్రా వీడు మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు!

టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ము రేపుతున్నాడు. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఫస్ట్ సెషన్‌లోనే మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అతని స్థానంలో అవకాశం అందుకున్న ఆకాశ్ దీప్.. తన పేస్‌తో ఇంగ్లండ్‌ను వణికిస్తున్నాడు.

తొలి వికెట్‌ను నోబాల్ రూపంలో దేవుడికిచ్చిన ఆకాశ్ దీప్.. ఆ తర్వాత మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెన్ డక్కెట్, ఓలీ పోప్, జాక్ క్రాలీలను పెవిలియన్ చేర్చాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న ఆకాశ్ దీప్.. తల్లి ఆశీర్వాదంతో మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నాడు.

 Who Is Akash Deep? Meet India Pacer Who Left Cricket For 3 Years for Family Issues

రెండేళ్ల క్రితమే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ద్వారా భారత క్రికెట్‌‌కు పరిచయమైన ఆకాశ్ దీప్.. ఇప్పటి వరకు తన మార్క్ చూపించలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి టీమిండియా పిలుపు అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌కు కళ్లెం వేసిన ఆకాశ్ దీప్ బౌలింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అతని గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్ల ఆకాశ్‌ దీప్ క్రికెట్ ప్రయాణం అంత సాఫిగా సాగలేదు. క్రికెటర్ అవుతానంటే ముందుగా అతని తండ్రే ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆకాశ్ దీప్ మాత్రం ఆటపై మక్కువతో ఓ బంధవు సాయంతో ఉద్యోగం చేసుకుంటూ ఓ లోకల్ అకాడమీలో చేరాడు.

తన పేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. కానీ ముందడుగు వేయలేకపోయాడు. ఆ సమయంలోనే అతని తండ్రి గుండెపోటుతో మరణించాడు. మరో రెండు నెలల వ్యవధిలో సోదరుడిని కూడా కోల్పోయాడు. దాంతో ఆకాశ్ దీప్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. దాంతో ఆకాశ్ దీప్‌ క్రికెట్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు అతను క్రికెట్‌కు దూరమయ్యాడు.

కానీ తనకు ఇష్టమైన ఆట అతన్ని వెంటాడింది. మళ్లీ బంతిని పట్టుకొని మైదానంలో దిగేలా చేసింది. దాంతో కోల్‌కతాకు వెళ్లిన అతను ఓ చిన్న గదిలో అద్దెకు దిగాడు. 2019లో బెంగాల్ అండర్ 23 జట్టు తరఫున బరిలోకి దిగాడు. అనంతరం ఆ జట్టు తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. రంజీలో నిలకడగా రాణించడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో అతన్ని ఆర్‌సీబీ రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అదే జట్టులో అతను కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన అతను 103 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, February 23, 2024, 12:03 [IST]
Other articles published on Feb 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+