WTC Final: భారత జట్టులో చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఎవరు?
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. జట్టుతో పాటు నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. దేశవాళీల్లో మెరుగ్గా రాణించిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జన్ నాగ్‌వస్వల్ల వీరిలో ఉన్నారు. వీరంతా జట్టుతో పాటు ఇంగ్లండ్ వెళతారు. సిరీస్ మధ్యలో ఎవరికైనా గాయమైతే జట్టులో చేరే అవకాశం ఉంటుంది. ప్రసిద్, ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ద్వారా అందరికీ సుపరిచితమే. కానీ అభిమన్యు ఈశ్వరన్, అర్జాన్ ఇప్పటివరకు లీగ్‌లో ఆడలేదు. వీరిద్దరూ దేశవాళీలో మాత్రం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అర్జాన్ గుజరాత్ లెఫ్టార్మ్ పేసర్‌గా సత్తాచాటుతుండగా.. ఈశ్వరన్ బెంగాల్ తరఫున బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు. అతని గురించి ఓ లుక్కెద్దాం.

ఎవరీ అభిమన్యు ఈశ్వరన్?
అభిమన్యు ఈశ్వరన్.. సెప్టెంబర్ 6, 1995లో ఉత్తర ప్రదేశ్‌లోని డెహ్రాడన్‌లో జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 25 ఏళ్లు. దేశవాళీ టోర్నీల్లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అభిమన్యు కుడిచేతి బ్యాట్స్‌మన్. 2013లో ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43.57 సగటుతో 4,401 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. 62 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో 2875 రన్స్ చేశాడు.

861 పరుగులతో..
2018-19 సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 861 పరుగులు చేసిన అభిమన్యు అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఇండియా ఏ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు స్టాండ్‌బై ఎంపికయ్యాడు. మరోసారి స్టాండ్ బైగా అవకాశం అందుకున్న అభిమన్యు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. స్టార్ ఆటగాళ్ల నేపథ్యంలో తుది జట్టులో అభిమన్యుకు అవకాశం దక్కడం కష్టమే.

మెరుగైతే చాలు..
ఈ పర్యటనలో తాను ఓ ఆటగాడికి మెరుగైతే సంతోషిస్తానని, ఇక అవకాశం వస్తే మరింత ఆనందపడతానని అభిమన్యు తెలిపాడు. చతేశ్వర్ పుజారా, కోహ్లీ, రోహిత్ శర్మలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం తనకు ఓ గొప్ప అనుభూతని తెలిపాడు. పుజారా, కోహ్లీ, రోహిత్ శర్మలు నెట్స్‌లో కూడా మ్యాచ్ ఆడినట్లే ఆడుతారని తెలిపాడు. ఇక జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరుగుతుంది.

భారత్ జంబో జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దీమాన్ సాహా(ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి).
స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్‌వాలా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications