For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నితీష్.. నీ స్థాయి ఏంటో తెలుసా? హ్యారీ బ్రూక్ కవ్వింపులు!

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. అతని ఏకాగ్రత దెబ్బతినేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విసిగించారు. 'నీ స్థాయి ఏంటో తెలుసా?'అని కవ్వింపులకు దిగారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్.. నితీష్ కుమార్ రెడ్డిన అన్న మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. నితీష్ మాత్రం వాటికి స్పందించకుండా తన బ్యాటింగ్‌ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. కానీ లంచ్ బ్రేక్ ముందు క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది.

అసలేం జరిగిందంటే..

58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసారు. జట్టును ఆదుకుంటాడని భావించిన రిషభ్ పంత్‌ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో సెట్ అయిన కేఎల్ రాహుల్‌ను బెన్ స్టోక్స్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌(0)ను ఆర్చర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 80 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఆచితూచి ఆడారు.

Who Do You Think You Are Harry Brook s Fiery Exchange with Nitish Reddy Referencing SRH Days
Photo Credit: X (twitter)

ఈ ఇద్దరూ ఆచితూచి ఆడి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. దాంతో సహనం కోల్పోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. ఓవైపు నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరోవైపు రవీంద్ర జడేజాతో వాగ్వాదానికి దిగారు. వారి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి చేరువగా వచ్చిన హ్యారీ బ్రూక్.. అతన్ని తక్కువగా చేస్తూ మాట్లాడాడు. ' సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు నీ నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చేది కాదు. నీ గురించి నువ్వేం అనుకుంటున్నావ్'అని అన్నాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.

జడేజా X బ్రైడన్ కార్స్

మరోవైపు బ్రైడన్ కార్స్, జడేజా మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పరుగు తీసే క్రమంలో బ్రైడన్ కార్స్‌కు జడేజా తాకగా.. అతను నోటికి పనిచెప్పాడు. జడేజా కూడా ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. బెన్ స్టోక్స్ జోక్యం చేసుకొని ఇద్దరి ఆటగాళ్లను విడదీసాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్లకు 112 పరుగులు చేసింది.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్ (జోరూట్ 104, బుమ్రా 5/74)
భారత్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్( కేఎల్ రాహుల్ 100, క్రిస్ వోక్స్ 3/84)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్( జోరూట్ 40, వాషింగ్టన్ సుందర్ 4/22)
భారత్ రెండో ఇన్నింగ్స్112/8( రవీంద్ర జడేజా 17 బ్యాటింగ్)

Story first published: Monday, July 14, 2025, 18:06 [IST]
Other articles published on Jul 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+