ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఆతిథ్య పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌తో ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీ జరుగుతుండగా.. మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఈ టోర్నీలో టాప్-8 ర్యాంకింగ్స్ కలిగిన జట్లు తలపడుతున్నాయి. ఈ 8 టీమ్స్‌ను రెండు గ్రూప్‌లు విభజించారు. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన ప్రతీ టీమ్ మూడేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతాయి. లీగ్ దశ ముగిసిన అనంతరం రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి.

సెమీఫైనల్ చేరే జట్లు ఏంటంటే..?
ఏ జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయంటే.. గ్రూప్-ఏ నుంచి భారత్ కచ్చితంగా సెమీస్ చేరుతుంది. ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవలే ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ, రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. మహమ్మద్ షమీ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. గత కొంతకాలంగా ఐసీసీ వన్డే టోర్నీల్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. బుమ్రా లేకపోవడం మినహా టీమిండియాకు ఎలాంటి సమస్యలు లేవు.
న్యూజిలాండ్ వర్సెస్ పాక్
గ్రూప్-ఏ సెకండ్ సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. పాక్ గడ్డపై ముక్కోణపు సిరీస్ గెలిచి న్యూజిలాండ్ మంచి జోష్‌లో ఉంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్‌తో రెండు సార్లు తలపడిన కివీస్ రెండింటికి రెండు మ్యాచ్‌లు గెలిచింది.
ఇరు జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టుకే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలున్నా.. ఆతిథ్య పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆతిథ్య దేశంగా పాక్.. తమకు అనుకూలంగా పిచ్‌లను తయారు చేసుకొని ఆడుతోంది. ఆ జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రూప్-ఏలోని మరో టీమ్ బంగ్లాదేశ్ సంచలన విజయాలు సాధించినా.. సెమీస్ చేరే బలం అయితే లేదు.
సౌతాఫ్రికా, ఆసీస్, ఇంగ్లండ్..?
గ్రూప్-బీ నుంచి సెమీస్ రేసు కోసం సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా, ఆసీస్ బలంగా కనిపిస్తున్నాయి. సౌతాఫ్రికాలో స్పిన్నర్ కేశవ మహారాజ్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. రెండో సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొననుంది. ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఆ జట్టును గాయాల బెడద వేధిస్తున్నా.. సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా ఐసీసీ టోర్నీల్లో మెరుగైన రికార్డ్ ఉంది. అఫ్గానిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నా.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. మా అంచనా ప్రకారం భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరుతాయి. మీ అంచనాను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.