Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL చరిత్రలో అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్ ఎవరో తెలుసా? మన హైదరాబాదోడే!

Which bowler has the best economy rate in 13 years IPL history

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెజంర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. అయితే గత 13 ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది అనామక ఆటగాళ్లను స్టార్లను చేసింది. వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటోంది.

పూర్తిగా బ్యాట్స్‌మన్ ఆధిపత్యం చెలాయించే ఈ పొట్టి ఫార్మాట్‌లో పొదపుగా బౌలింగ్ చేయడం బౌలర్లు చాలా కష్టం. ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. ఏదో ఒక రోజు బ్యాట్స్‌మెన్‌కు బలవ్వాల్సిందే. అలాంటిది గత 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేసిన ఆటగాడైన ఎవరైనా ఉన్నారంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్, అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖానే.

టాపర్ రషీద్ ఖాన్

2017‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ అఫ్గాన్ స్టార్ అనతి కాలంలో వరల్డ్ క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. పొట్టి ఫార్మాట్‌లో తనదైన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మైమరిపిస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్.. 6.24 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంటే ఓవర్‌కు 6కు మించి పరుగులివ్వలేదన్నమాట.

దాంతో కనీసం 100 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆటగాళ్ల బెస్ట్ ఎకానమీ జాబితాలో రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో అయితే రషీద్ 16 మ్యాచ్‌ల్లో 5.37 ఎకానమీతోనే పరుగులిచ్చాడు. 2019లో 6.28, 2018లో 6.73, 2017లో 6.62 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు సీజన్లలో కలిపి 75 వికెట్లు పడగొట్టాడు.

కుంబ్లే సెకండ్..

కుంబ్లే సెకండ్..

ఈ బెస్ట్ ఎకానమీ లిస్ట్‌లో రషీద్ తర్వాత ఇండియా లెజెండ్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 42 మ్యాచ్‌ల్లో 6.57తో పరుగులిచ్చాడు. ఆ తర్వాత ముత్తయ్య మురళీ ధరన్(6.67), సునీల్ నరైన్(6.77), డానియల్ వెటోరి(6.78), రవిచంద్రన్ అశ్విన్(6.87) ఉన్నారు. టాప్-10లో డేల్ స్టెయిన్ ఒక్క పేసర్ (6.91) చోటు దక్కించుకున్నాడు. లీగ్ అత్యధిక హ్యాట్రిక్‌లు తీసిన ఘనత మాత్రం అమిత్ మిశ్రా పేరిట ఉంది. మిశ్రా మూడు సార్లు ఈ ఫీట్ సాధించగా.. యువ రాజ్ సింగ్ రెండు సార్లు హ్యాట్రిక్ తీశాడు.

హయ్యెస్ట్ వికెట్ టేకర్..

హయ్యెస్ట్ వికెట్ టేకర్..

ఇక లీగ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా లసిత్ మలింగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 122 మ్యాచ్‌ల్లో 7.14 ఎకానమీతో 170 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అమిత్ మిశ్రా(160), పియూష్ చావ్లా(156), డ్వేన్ బ్రేవో(153), హర్భజన్ సింగ్(150), రవిచంద్రన్ అశ్విన్(138) , భువనేశ్వర్ కుమార్(136), సునీల్ నరైన్(127), యుజ్వేంద్ర చాహల్(121), ఉమేశ్ యాదవ్(119) ఉన్నారు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో సునీల్ నరైన్, లసిత్ మలింగా ఏడేసి సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నారు. ఆ తర్వాత ఆండ్రూ టై, లక్షీపతి బాలాజీ నాలుగేసి సార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అల్జారీ జోసెఫ్(6/12) బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు.

Story first published: Friday, April 9, 2021, 12:06 [IST]
Other articles published on Apr 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+