
గబ్బర్‌కు నో చాన్స్..
అయితే తాజా రూల్స్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. లీగ్‌లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత పటిష్టంగా ఉన్న జట్టు ఢిల్లీ. యువ ఆటగాళ్లతో కూడా ఢిల్లీ.. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలవగా.. ఈ సీజన్ టేబుల్ టాపర్‌గా ఉంది.
ముఖ్యంగా ఎంతో ప్రతిభ కలిగిన భారత ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఒక విధంగా ఈ మెగా వేలం ఢిల్లీకి డిస్‌అడ్వాంటేజే. అయితే ఆ జట్టు ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడిని అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. లీగ్ భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకే ఢిల్లీ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

శ్రేయస్ అయ్యర్
ఢిల్లీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గాయంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమైనా.. యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్‌కు అతను సిద్దమయ్యాడు. 2018 సీజన్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతం గంభీర్ తప్పుకోవడంతో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న అయ్యర్ అద్భుతంగా రాణించాడు.
2019లో మూడో స్థానాకి తీసుకెళ్లిన అయ్యర్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు సీజన్లలో 411, 463, 519 పరుగులు చేశాడు. టీమిండియా రెగ్యూలర్ ఆటగాడైనటువంటి అయ్యర్‌ను ఢిల్లీ వదులుకునే సాహసం చేయదు.

రిషభ్ పంత్
ఇక మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే రెండో ఆటగాడు రిషభ్ పంత్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఏక్షణాననైనా మ్యాచ్ స్వరూపాన్నే మార్చే రిషభ్ పంత్‌లాంటి పవర్ హిట్టర్‌ను ప్రతీ జట్టు కోరుకుంటుంది.
పైగా అతను ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత జట్టు తరఫున కూడా దుమ్మురేపుతున్నాడు. టీమిండియా భవిష్యత్తు సారథిగా కనిపిస్తున్నాడు. అలాంటి పవర్ హిట్టర్‌ను ఢిల్లీ ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు. 2016 నుంచి ఢిల్లీకి ఆడుతున్న పంత్.. ప్రతీ సీజన్‌లో దుమ్మురేపాడు. 76 మ్యాచ్‌ల్లో 35.26 సగటుతో 2292 రన్స్ చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.

పృథ్వీ షా
ఇక ఢిల్లీ మూడో భారత ఆటగాడిగా పృథ్వీషాను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. సెహ్వాగ్ స్టైల్‌లో చెలరేగుతున్న షా.. ఒకే ఓవర్లలో 6 బౌండరీలను కూడా బాదాడు. బ్యాటింగ్ టెక్నిక్ లోపం వల్ల విమర్శలు ఎదుర్కొన్నా.. సమస్య అధిగమించి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఢిల్లీ తరఫునే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన షా.. 46 మ్యాచ్‌ల్లో 1134 రన్స్ చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి. ఇలానే అతను ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లోనూ రాణిస్తే అతన్ని రిటైన్ చేసుకోవడం ఖాయం. కానీ దారుణంగా విఫలమైతే మాత్రం ఢిల్లీ.. శిఖర్ ధావన్ వైపు చూడొచ్చు.

కగిసో రబడా..
విదేశీ కోటాలో ఢిల్లీ తీసుకునే ఏకైక ఆటగాడు కగిసో రబడా.. ఈ తరం క్రికెట్‌లో అతను ఎంత డేంజరస్ పేసరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఈ సౌతాఫ్రికా పేసర్ 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ఏడాది కూడా 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసాడు. ఎంతో ప్రభావవంతమైన రబడా విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి సాహసం చేయదు.
ఓవర్‌సీస్ కోటాలో కచ్చితంగా అతన్నే రిటైన్ చేసుకుంటుంది. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలోనే ఈ నలుగుర్ని తీసుకునే అవకాశం ఉంది. సెకండాఫ్ ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్ ఆధారంగా మెగా వేలం సమయానికి ఢిల్లీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో స్వల్ప మార్పులు జరగవచ్చు.


Click it and Unblock the Notifications












