For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే..?

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు అదిరిపోయే సన్నద్దత లభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకపక్ష విజయాలు సాధించింది. నాలుగో టీ20లో కూడా ప్రయోగాలతో కావాలనే ఓటమిపాలైంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజం సాధించేది.

ఈ సిరీస్ ద్వారా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యాదవ్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గతేడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని సూర్యకుమార్ యాదవ్.. ఈ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల్లో 242 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సూర్య.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

When Will Team India Play Their Next T20 Match Ahead of the ICC T20 World Cup 2026

ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ దారుణంగా విఫలమైనా.. జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో సెంచరీతో కదం తొక్కి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌లోనూ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ రాణించారు.

ఈ సిరీస్ ద్వారా టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో పటిష్టంగా ఉన్నట్లు కనిపించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక జారీ చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 7న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ రెండు కీలక మ్యాచ్‌లకు ముందు టీమిండియా సౌతాఫ్రికాతో బుధవారం(ఫిబ్రవరి 4) వామప్ మ్యాచ్ ఆడనుంది. డివైపాటిల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వనుంది.

భారత్ ప్రపంచకప్ షెడ్యూల్..

ఫిబ్రవరి 7 (శనివారం): భారత్ vs USA, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై (రాత్రి 7 గంటలకు)

ఫిబ్రవరి 12 (గురువారం): భారత్ vs నమీబియా, వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(రాత్రి 7:00 గంటలకు)

ఫిబ్రవరి 15 (ఆదివారం): భారత్ vs పాకిస్థాన్, వేదిక: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (శ్రీలంక), రాత్రి 7:00 గంటలకు

ఫిబ్రవరి 18 (బుధవారం): భారత్ vs నెదర్లాండ్స్, వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, రాత్రి 7:00 గంటలకు

Story first published: Sunday, February 1, 2026, 17:00 [IST]
Other articles published on Feb 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+