సెహ్వాగ్‌ను ఇబ్బంది పెట్టిన సన్నీలియోన్.. ఎప్పుడంటే?

ముంబై: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నేటితో(బుధవారం) 39వ వసంతంలోకి అడుగుపెట్టింది. సన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. మరెన్నో షోలకు హోస్ట్‌గా.. ఫంక్షన్స్‌కు ప్రజెంటర్‌గా వ్యవహరించింది. తన అందాలతో అభిమానుల మనసులను దోచుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. క్రికెట్ కామెంట్రీ కూడా చెప్పింది. అది కూడా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి వ్యాఖ్యానం చేసింది.
ఐపీఎల్-10 సందర్భంగా యూసీ న్యూస్ కోసం సెహ్వాగ్, సన్నీలియోన్ 'మసాలా కామెంట్రీ' చెప్పారు. ఓ మ్యాచ్ సందర్భంగా సన్నీలియోన్.. క్రికెట్ గురించి తెలిసి తెలియని ప్రశ్నలతో సెహ్వాగ్‌ను విసిగించింది. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్‌తో అభిమానులకు కావాల్సిన ఫన్ క్రియేట్ చేసింది. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో అభిమానులు నాటి ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

సెహ్వాగ్- సన్నీ ర్యాపిడ్ ఫైర్..
సెహ్వాగ్: సన్నీ నీ అంచనా ప్రకారం ఈ సీజన్(ఐపీఎల్ 10) టైటిల్ ఎవరు గెలుస్తారు?
సన్నీ: ఈ మ్యాచ్‌లో మాత్రం హైదరాబాద్ గెలవాలనుకుంటున్నా. కానీ నాకు షారుఖ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి కేకేఆర్ ఈ సీజన్ టైటిల్ గెలుస్తుంది.
సన్నీ: సరేకానీ ఫీల్డర్లు ఎందుకు గ్లోవ్స్ వేసుకోరు?
సెహ్వాగ్: వారెవ్వా.. మంచి ప్రశ్న. అన్నిటికీ సమాధానం చెబుతా కానీ.. యాక్టర్స్ కెమెరా వెనుక ఎందుకు నటించరు?
సన్నీ: నీ ఫేవరేట్ ప్లేయర్ ఎవరు? సెహ్వాగ్ పాజీ
సెహ్వాగ్: ఐపీఎల్‌లో నా ఫేవరేట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్
నా ఫేవరేట్ పార్ట్‌నర్ గంభీర్..
సన్నీ: నీవు ఆడుతున్న రోజుల్లో నీ ఫేవరేట్ ఓపెనింగ్ భాగస్వామి ఎవరు?
సెహ్వాగ్: నా ఫేవరేట్ ఓపెనర్ గంభీర్
సన్నీ: నీ తరంలో అద్భుతంగా ఆడావు. టీమిండియా కోచ్‌గా చేస్తావా?
సెహ్వాగ్: లేదు, నేనేం ఖాలీగా లేను. అయినా బీసీసీఐ నాకు ఆ అవకాశం ఇవ్వదు. యూసీ మాత్రం ఇలాంటి ఆఫర్‌లు ఇస్తుంది.

సాకర్ అంటే ఇష్టం..
ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాక్స్ క్రికెట్ లీగ్‌లో ఈ శృంగార తార ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం. అవును.. 2016లో సన్నీ.. చెన్నై స్వాగర్స్ జట్టును కొనుగోలు చేసింది. సందర్భానుసారం ఆటలపై తనకున్న మక్కువను చాటుకుంది. ముఖ్యంగా క్రికెట్ కన్నా సాకర్ అంటే తనకు పిచ్చని చెప్పుకొచ్చింది.
‘నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నా జీవితంలో వివిధ రకాల స్పోర్ట్స్ ఆడాను. సాకర్ నా ఫేవరేట్ స్పోర్ట్. దాన్ని తక్కువగా ఆడినా చాలా ఇష్టం. పింగ్-పాంగ్, వాలీ బాల్, బాస్కెట్ బాల్ ఆడూతునే పెరిగాను. ఇక పెద్దగాయ్యాకే క్రికెట్ గురించి తెలుసుకున్నా. క్రికెట్‌లో ఏదో ఉంది. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం ఆస్వాదిస్తాను. భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాతే దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నా.' అని ఓ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
హిందూ దేవాలయం సందర్శించి మరీ.. సాయం చేసిన అఫ్రిది!