Rovman Powell: ఢిల్లీ హిట్టర్ వెనుక కేజీఎఫ్‌ను మించిన విషాద గాధ.. అమ్మకు ఇచ్చిన మాటతో..

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హిట్టర్, విండీస్ విధ్వంసకర వీరుడు రోవ్‌మన్ పొవెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీకి అద్భుత విజయాన్నందించాడు. అయితే ఈ ఒక్క మ్యాచ్‌తో భారత అభిమానుల దృష్టిని ఆకర్షించిన రోవ్‌మన్ పొవెల్ వెనుక ఆల్‌టైమ్ హిట్ మూవీ కేజీఎఫ్ సినిమాను మించిన విషాధ గాధ ఉంది.
కేజీఎఫ్‌లో రాకీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట'ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా'ఎలా నిలబెట్టుకున్నాడో.. అలానే రోవ్‌మన్ పొవెల్ సైతం తన తల్లికి పేదరికం నుంచి బయటపడేస్తానని మాట ఇచ్చాడు.

పేదవాడిగా పుట్టడం తప్పుకాదు..
కేజీఎఫ్‌లో 'పేదవాడిగా పుట్టడం నీ తప్పుకాదు .. కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే' అనే తల్లిమాట వెంటే రాకీ భాయ్ నడుస్తాడు. రోవ్‌మన్ పొవెల్ సైతం తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. తాజాగా రోవ్‌మన్ పొవెల్ అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడిన వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్.. అతని జీవితంలో కష్టాలను భారత అభిమానులకు తెలియజేశాడు.

తల్లికి ఇచ్చిన మాటతో..
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన అతను.. 'మీలో ఎవరికైనా ఓ పది నిమిషాల సమయం ఉంటే.. వెళ్లి రోవ్‌మన్ యూట్యూబ్‌లో ఉన్న రోవ్‌మన్ పొవెల్ లైఫ్‌స్టోరీ చూడండి. నేను.. నాతోపాటు మరికొంత మంది పావెల్ ఐపీఎల్ ఆడాలని ఎందుకు కోరుకున్నామో.. అతడు అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించామో మీకే తెలుస్తుంది. చిన్న స్థాయి నుంచి అతడు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చాడు. తాను సెకండరీ స్కూళ్లో ఉన్నపుడే పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తానంటూ తన తల్లికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు''అని పావెల్ వ్యక్తిత్వాన్ని ఇయాన్ బిషప్ తెలియజేశాడు.

పేదరికాన్ని జయించి
1993, జూలై 23న జమైకాలోని ఓ మారుమూల ప్రాంతంలో పొవెల్ జన్మించాడు. అతని తల్లి సింగిల్ పేరెంట్. పావెల్‌తో పాటు ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఎన్నో కష్టాలు పడుతూ వారిని పెద్ద చేసింది. చిన్న ఇంట్లో తల్లి ఇబ్బందులు చూస్తూ పెరిగిన పొవెల్.. ఆమె ప్రశాంత జీవితం గడిపేలా అన్ని సౌకర్యాలు ఉన్న జీవితం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగానే చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రూ.2.8 కోట్ల భారీ ధరతో..
దానిని నిజం చేసుకుని తల్లి, చెల్లిని బాగా చూసుకుంటున్నాడు. పొవెల్ జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను కరేబియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ సమయంలో డాక్యుమెంటరీ ద్వారా అందరికి తెలియజేశారు. ఇక పొవెల్ కెరీర్ విషయానికొస్తే.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
ఆ మరుసటి ఏడాది పాకిస్థాన్‌తో సిరీస్‌తో టీ20 ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైన పొవెల్.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ. 2.8 కోట్ల భారీ ధర పలికాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మెగా వేలానికి ముందు భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో పొవెల్ రాణించడం అతనికి కలిసొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications