
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేంటో కానీ టీమిండియా అద్భుత విజయాలు సాధించినప్పుడు అస్సలు పట్టించుకోని నెటిజన్లు, ఓడినప్పుడు మాత్రం అతనిపై దుమ్మెత్తిపోస్తారు. ఎప్పుడెప్పుడా అని విమర్శిస్తుంటారు. తనపై ఎన్నిరకాల మీమ్స్, ట్రోల్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోని ఈ భారత మాజీ కెప్టెన్.. తన వల్ల కొందరైనా నవ్వితే, సంతోషమేనంటూ కొట్టి పారేస్తాడు. అయితే రవిశాస్త్రిపై ఇంత ట్రోలింగ్ రావడానికి తాగుడుతో పాటు బాలీవుడ్ భామలతో అతను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఓ కారణం.
అయితే కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 2016లో నిమ్రత్ కౌర్‌తో కలిసి జర్మన్ బ్రాండ్ ఆడీ కారు ఓపెనింగ్‌కు వెళ్లిన రవిశాస్త్రి.. ఆ తర్వాత కొన్ని పార్టీలు, కార్యక్రమాల్లో ఆమెతో కలిసి కనిపించాడు. దాంతో త్వరలోనే రవిశాస్త్రి, నిమ్రత్‌ను పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారనే రూమర్స్ వచ్చాయి.
అయితే 2018 ఇంగ్లండ్ పర్యటనకు ముందు మిడ్ డే దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ రూమర్లను కొట్టిపారేశాడు. ఇదంతా పెంట యవ్యారమని, ఇలాంటి వాటిని తన ముందు ప్రస్తావించవద్దని ఘాటుగా బదులిచ్చాడు. 'ఏముంది చెప్పడానికి ఇదంతా పెంట యవ్వారం. పెంట అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి'అని చెప్పుకొచ్చాడు. ఈ రూమర్స్‌ను నిమ్రత్ కౌర్ కూడా అప్పట్లో ఖండించింది.
ఇక బాలీవుడ్ హీరోయిన్ అమ్రితా సింగ్‌తో ప్రేమాయణం నడిపిన రవిశాస్త్రి.. ఆ తర్వాత 1990లో రితూ సింగ్‌ను పెళ్లాడాడు. అయితే ఏడాది తర్వాత ఈ ఇద్దరూ విడిపోగా.. రితూ సింగ్‌ను సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం. ఇక కరీనా కపూర్‌లో మాయలో పడిన సైఫ్ అలీఖాన్ 2004లో అమ్రితా సింగ్‌కు విడాకులిచ్చాడు.