Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్షయ్ కుమార్‌పై పంజాబ్ నయా మ్యాచ్ విన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఆగ్రహం! ఎందుకో తెలుసా?

 When Punjab Kings’ Harpreet Brar slammed Akshay Kumar

న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ యువ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ సంచలన ప్రదర్శనకు విలవిలలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 34 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హర్‌ప్రీత్ ముందుగా బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్‌కు అండగా నిలిచి.. ఆ తర్వాత బౌలింగ్‌లో మాయ చేశాడు. ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చి ఆర్‌సీబీ బలం, బలగమైన విరాట్‌ కోహ్లీ (35), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), ఏబీ డివిలియర్స్‌ (3)ను పెవిలియన్ చేర్చాడు.

ఇక విరాట్, మ్యాక్సీని వరుస బంతుల్లో ఔట్ చేయడం విశేషం. తమ ప్రణాళికల్లోనే లేని హర్‌ప్రీత్ బ్రార్ సంచలన్ పెర్ఫామెన్స్‌కు ఆర్‌సీబీ తెల్లమొహం వేసింది. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఈ యువ స్పిన్నర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ కూడా దక్కింది. ఈ సంచలన ప్రదర్శనతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన హర్‌ప్రీత్ బ్రార్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ వారం క్రితం అతను చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

ఆ ట్వీట్ ఏంటంటే..?

బాలీవుడ్ హీరో‌ అక్షయ్ కుమార్‌పై ఈ పంజాబ్ బౌలర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. హర్‌ప్రీత్ బ్రార్‌ను చూసి ఓ నెటిజన్.. 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమాలోని అక్షయ్ కుమార్‌లానే ఉన్నావని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశాడు. 2015లో వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సిక్కు కుర్రాడి పాత్ర పోషించాడు. వారిలానే టర్బన్(తలపాగ) ధరించాడు. అయితే అభిమాని కామెంట్‌కు చిర్రుత్తుకుపోయిన హర్‌ప్రీత్ బ్రార్.. ఆ కామెంట్‌ స్క్రీన్ షాట్ చేస్తూ మరీ ఆగ్రహంగా ట్వీట్ చేశాడు.

తాను డబ్బుల కోసం టర్బన్ ధరించననే ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు. అంతేకాకుండా రైతు ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆ మధ్య రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా అక్షయ్ కుమార్ తన గళాన్ని వినిపించిన విషయం తెలిసిందే.

 తొలి వికెట్ విరాట్..

తొలి వికెట్ విరాట్..

తన బౌలింగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సిక్స్ బాదినా బాధపడలేదని మ్యాచ్ అనంతరం ఈ యువ స్పిన్నర్ తెలిపాడు. ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ కోహ్లీదే కావడం ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నాడు. 'నాది మోగా జిల్లా. అక్కడి ప్రజలు నాకు అండగా నిలుస్తారని, నా ప్రదర్శన పట్ల గర్వంగా ఫీలవుతారని తెలుసు. విరాట్ కోహ్లీ నా బౌలింగ్‌లో బాదేసినప్పుడు నేను ఆందోళన చెందలేదు.

ఎందుకంటే పుంజుకొనేందుకు బౌలర్‌కు రెండో అవకాశం వస్తుంది. ఐపీఎల్‌లో నా తొలి వికెట్‌ కోహ్లీదే కావడం నాకెంతో ప్రత్యేకం. మొదట్లో పరుగులిచ్చినా.. కోహ్లీ భాయ్ వికెట్‌ పడటంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రెండు ఓవర్లు ఆగాను. రాహుల్‌ భాయ్‌ పరిస్థితుల గురించి వివరిస్తూ ఎలాంటి షాట్లు ఆడొచ్చో సూచించాడు. అలానే షాట్లు ఆడాను. నా ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా' అని తెలిపాడు.

ముందే సిద్దం చేశాం..

ముందే సిద్దం చేశాం..

హర్‌ప్రీత్‌ బ్రార్‌పై పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లు కురిపించాడు. బ్రార్‌ను ముందే సిద్ధం చేశామని, అహ్మదాబాద్‌ తరహా పిచ్‌ల్లో ఒక ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే అతన్ని తీసుకున్నామని రాహుల్ తెలిపాడు. తమ అంచనాలను మించి బ్రార్‌ రాణించాడన్నాడు. 'మేము బ్రార్‌ను ముందే సిద్ధం చేశాం. ఇలాంటి పిచ్‌లో ఒక ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే అతన్ని తీసుకున్నాం. ఇక్కడ ఫింగర్‌ స్పిన్నర్లు వేసే లెంగ్త్‌ను ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. మేము ఏదైతే అనుకున్నామో బ్రార్‌ అదే చేశాడు. అంతేకాదు చివరికి బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. నేను యువ ఆటగాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. నా ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ అనుభవాలను వారితో పంచుకుంటున్నా. వారికి అపారమైన ప్రతిభ ఉంది. కానీ వారిని పరిస్థితుల్ని బట్టి ఆడే విధంగా సిద్దం చేయాలి. జట్టును ముందుండి నడిపించడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ విన్నర్ హర్‌ప్రీత్..

మ్యాచ్ విన్నర్ హర్‌ప్రీత్..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (57 బంతుల్లో 91 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్షల్‌ పటేల్‌ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్‌ పటిదార్‌ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.

19 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన పంజాబ్‌ కింగ్స్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Saturday, May 1, 2021, 17:30 [IST]
Other articles published on May 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+