న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni కోసం ముంబై ఇండియన్స్ పోటీ.. ఆ దిగ్గజ ప్లేయర్‌ లేకుంటే తాలా ఉండేవాడు కాదు!

When Mumbai Indians couldnt buy MS Dhoni due to icon player Sachin Tendulkars huge salary
#IPL2021 : MI Tried To Get MS Dhoni In IPL 1st Auction,But Here Is How CSK Catches Him

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలో బిగ్ స్టార్లకు కొదవలేకపోవడంతో మ్యాచ్‌లన్నీ హోరాహోరీగా సాగుతాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 31 సార్లు తలపడగా.. 19సార్లు ముంబైనే పైచేయి సాధించింది. అయితే ఈ 31 మ్యాచ్‌ల్లో దాదాపు అన్నీ రసవత్తరంగా జరిగినవే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠతను తలిపించినవే.

అందుకే ఈ స్టార్ టీమ్స్ మధ్య వార్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రెండు జట్ల మధ్య హైఓల్టేజ్ వార్‌కు ఐపీఎల్ ఆరంభంలోనే బీజం పడింది. ఆరంభ సీజన్( 2008) కోసం జరిగిన వేలంలో ఈ ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి.

ధోనీ కోసం పోటీపడ్డ ముంబై..

ధోనీ కోసం పోటీపడ్డ ముంబై..

2007 టీ20 ప్రపంచకప్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టును తనదైన మార్క్ కెప్టెన్సీతో ధోనీ విశ్వవిజేతగా నిలిపాడు. దాంతో మహీ అందరి దృష్టి ఆకర్షించడంతో పాటు ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2008 సీజన్ కోసం జరిగిన వేలంలో మహీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు లీగ్ నిబంధనల కారణంగా ముంబై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. లేకుంటే ధోనీ ముంబై జట్టుకే ఆడేవాడు. అప్పుడు సీఎస్‌కే అభిమానుల తాలా ఉండేవాడు కాదు.

రూ. 10 కోట్లు పలికిన ధోనీ..

రూ. 10 కోట్లు పలికిన ధోనీ..

వేలంలో ముంబై- చెన్నై మధ్య నెలకొన్న పోటీతో ధోనీ పంట పడింది. ఆరంభ సీజన్‌లోనే అతను ఏకంగా రూ.10 కోట్లుకు పైగా పలికాడు. ఆ సీజన్‌లో ఇదే హయ్యెస్ట్. వాస్తవానికి ముంబై ఇండియన్స్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రూపంలో స్టార్ ఆటగాడున్నాడు. కానీ చెన్నైకి ఏ స్టార్ ప్లేయర్ లేకపోవడంతో ధోనీ కోసం ఏందాకైనా సరే అన్న రీతిలో వేలంలో పాల్గొంది. చివరకు 1.5 మిలియన్ల అమెరికా డాలర్ల(రూ. 10 కోట్లకు పైగా)కు మహీని సొంతం చేసుకుంది. మరోవైపు సచిన్ టెండూల్కర్ కారణంగా ముంబై ఇండియన్స్ పోటీలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆ జట్టు సచిన్ కోసం భారీ ధరను వెచ్చించింది. దాంతో కనీస ధర అనే రూల్స్ అడ్డురావడంతో వెనక్కి తగ్గింది.

సచిన్ కారణంగా..

సచిన్ కారణంగా..

జట్టు పర్స్‌ మొత్తం 5 మిలియన్ల అమెరికా డాలర్లే ఉండటం.. అందులో ఐకాన్ ప్లేయర్లకు 15 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయవద్దనే నిబంధన ఉండటం.. ముంబై ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. సచిన్, ధోనీలకే భారీ మొత్తం ఖర్చు చేస్తే ఇతర ఆటగాళ్లను కొనలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో ముంబై ధోనీని వదులుకోక తప్పలేదు. కానీ చెన్నైకి స్టార్ ప్లేయర్ లేకపోవడంతో ధోనీ కోసం ఎంతైనా ఖర్చు చేసే వెసులుబాటు కలిగింది. దాంతో ఈ స్టార్ కూల్ కెప్టెన్‌ను అరవం జట్టు దక్కించుకుంది.

సక్సెస్‌ఫుల్ కెప్టెన్..

సక్సెస్‌ఫుల్ కెప్టెన్..

ఇక ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలుచుకుంది. గత సీజన్ మినహా ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 197 మ్యాచ్‌ల్లో 119 విజయాలందుకుంది. ఐపీఎల్‌లో 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ మహీ. కరోనాతో ఆగిపోయిన తాజా సీజన్‌లోనూ సీఎస్‌కే దుమ్మురేపింది. 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే మహీ వచ్చే సీజన్ ఆడటంపై అనుమానులు నెలకొన్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్‌ను 2008-2011 వరకు నడిపించిన సచిన్ ఒక్క టైటిల్ అందుకోలేకపోయాడు. 2010లో ఫైనల్‌కు చేర్చినప్పటికీ ధోనీ సేన చేతులో ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు.

Story first published: Tuesday, May 18, 2021, 13:14 [IST]
Other articles published on May 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X