Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'తెల్లవారుజాము 3 గంటలకే విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపాలనుకున్నా.. కానీ భయమేసింది'

When Kuldeep Yadav Wanted To Wake Up Virat Kohli At 3 AM
MS Dhoni Retirement : Dhoni రిటైర్మెంట్ షాకింగ్! ఎమోషనల్ అయిన Virat Kohli,Sachin Tendulkar !

అబుదాబి: తెల్లవారుజాము 3 గంటలకే లేచి కెప్టెన్ విరాట్ కోహ్లీని నిద్ర లేపాలనుకున్నా అని టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ తెలిపాడు. అయితే ఆ సమయంలో నిద్ర లేపితే.. తనపై కోప్పడతాడని గ్రహించి లేపకుండా ఉండిపోయానని పేర్కొన్నాడు. కుల్‌దీప్‌ టీమిండియాలోకి అరంగేట్రం చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది.

2014లో యూఏఈలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌‌లో రాణించడంతో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డ కుల్‌దీప్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరంగేట్రం చేసిన కుల్‌దీప్‌.. నాల్గో టెస్ట్ మ్యాచ్‌లో 4-68తో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మూడు మ్యాచ్‌లకు బెంచ్‌లోనే

మూడు మ్యాచ్‌లకు బెంచ్‌లోనే

కుల్‌దీప్‌ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లో తన ఆరంగేట్రం గురించి అనుభవాలను తాజాగా పంచుకున్నాడు. 'టీమిండియాకు ఆడడం నా కల. అది 2017లో నెరవేరింది. అది ఒక గౌరవం. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో నేను మొదటి మూడు మ్యాచ్‌లకు బెంచ్‌లో ఉన్నాను. కానీ నాలుగో మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉండమని కోచ్‌ అనిల్‌ కుంబ్లే సర్‌ నాకు చెప్పారు. ఆయన నాకు చాలా మద్దతు ఇచ్చారు. యువ స్పిన్నర్లు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో ఆయనకు బాగా తెలుసు' అని కుల్‌దీప్‌ అన్నాడు.

విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపుదామనుకున్నా:

విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపుదామనుకున్నా:

'మీరు రేపు మ్యాచ్‌ ఆడుతున్నారు. మీ నుంచి 5 వికెట్లు కోరుకుంటున్నా అని అనిల్‌ కుంబ్లే సార్‌ చేప్పినప్పుడు ముందు నేను భయపడ్డాను. ముందురోజు 9 గంటలకే నిద్రపోయి.. తెల్లవారుజాము 3గంటలకే లేచాను. ఆ సమయంలో నేను గందరగోళంలో ఉన్నాను. తొలి మ్యాచ్ ఎలా ఆడాలనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పక్కనే పడుకున్న విరాట్‌ భాయ్‌ను నిద్ర లేపుదామనుకున్నా. కానీ అతడు నాపై కోప్పడతాడని గ్రహించి లేపకుండా మళ్లీ నిద్రలోకి జారుకొన్నా. తిరిగి 6 గంటలకు లేచా' అని మణికట్టు స్పిన్నర్ తెలిపాడు.

చాలా ఎమోషనల్‌ అయ్యా:

చాలా ఎమోషనల్‌ అయ్యా:

'టెస్ట్ మొదలైన రోజు గ్రౌండ్‌లో అడుగు పెట్టా. ఎన్నో బావోద్వేకాలు మదిలో మెదిలాయి. సెంచరీ మార్కును దాటిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల భాగస్వామ్యాన్ని విడదీశాను. ఆరోజు మ్యాచ్‌లో వార్నర్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మాక్స్‌వెల్‌, పాట్ కమ్మిన్స్‌ వికెట్లు పడగొట్టగా. మొత్తంగా 4 వికెట్లు తీయడంతో నా కల నెరవేరింది. నా మొదటి రోజు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు నేను ఆరోజు రాత్రి చాలా ఎమోషనల్‌ అయ్యాను' అని కుల్‌దీప్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు.

అబుదాబిలో సాధన:

అబుదాబిలో సాధన:

కుల్‌దీప్‌ యాదవ్ ఐపీఎల్ 2020 కోసం ప్రస్తుతం అబుదాబిలో ఉన్నాడు. క్వారంటైన్‌ ముగించుకుని సాధన చేస్తున్నాడు. గతకొంత కాలంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అతడు ఆడుతున్న విషయం తెలిసిందే. 'లాక్‌డౌన్‌ అమలైన మొదట్లో ఇబ్బందులు పడ్డాను. బయట సాధన చేయలేక పోయా. ఇప్పుడు సర్దుకున్నా. వారానికి ఏడు రోజులూ మ్యాచులున్నా సంతోషమే, ఆడడానికి సిద్ధం' అని ఇటీవలే కుల్‌దీప్‌ అన్నాడు.

దేశం ఓ అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది: కోహ్లీ

Story first published: Tuesday, September 1, 2020, 10:54 [IST]
Other articles published on Sep 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+