Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఆటగాళ్లకు 42 రోజులు సెలవు.. తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే..?

శ్రీలంక పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియా‌కు 42 రోజుల విశ్రాంతి లభించనుంది. గతేడాదిగా కిక్కిరిసిన షెడ్యూల్‌తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లకు ఈ 42 రోజుల విశ్రాంతి ఉపశమనం కలిగించనుంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. రోహిత్ సేన మాత్రం 0-2తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆటగాళ్లు అంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమ్ హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.

When is Team India s next match Dates Venue Timings and Schedule

రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌.. భారత్‌కు రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్‌ 2025లో భాగంగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్‌ ఈ సిరీస్‌ను గెలవాల్సిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు సొంత గడ్డపైనే ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

టీమిండియా తదుపరి షెడ్యూల్..

1. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు

తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు

రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు

తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల, రాత్రి 7 గంటలకు

రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ, రాత్రి 7 గంటలకు

మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్, రాత్రి 7 గంటలకు

2. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్..

తొలి టెస్ట్: అక్టోబర్ 16-20, బెంగళూరు, ఉదయం 9.30 గంటలకు

రెండో టెస్ట్: అక్టోబర్24- 28, పుణే, ఉదయం 9.30 గంటలకు

మూడో టెస్ట్: నవంబర్ 1 నుంచి 5, ముంబై, ఉదయం 9.30 గంటలకు

3. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్)

తొలి టెస్ట్: నవంబర్ 22-26, పెర్త్, ఉదయం 7.50 గంటలకు

రెండో టెస్ట్(పింక్ బాల్): డిసెంబర్ 6-10, అడిలైడ్, ఉదయం 9.30 గంటలకు

మూడో టెస్ట్: డిసెంబర్ 14-18, బ్రిస్బేన్, ఉదయం 5.50 గంటలకు

నాలుగో టెస్ట్: డిసెంబర్ 26-30, మెల్‌బోర్న్, ఉదయం 5.00 గంటలకు

ఐదో టెస్ట్: జనవరి 03-07, సిడ్నీ, ఉదయం 5.00 గంటలకు

Story first published: Sunday, August 11, 2024, 12:17 [IST]
Other articles published on Aug 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+