Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1998లో దాదాగిరి.. మూడు సిక్సర్లు మైదానం బయటే!

When Dada sent them all out of the ground

హైదరాబాద్: ధనాధన్ ఫార్మాట్‌ రాకతో బ్యాట్స్‌మెన్‌కు ఫేవర్‌గా మారిన ఆటలో విధ్వంసకర ఆటగాళ్లు ఎక్కువైపోయారు. కానీ.. ఒకప్పుడు సిక్స్‌లతో మెరెపులు మెరిపించే ఆటగాళ్లంటే వేలమీద లెక్కపెట్టేంతమందే. జట్టుకు ఇద్దరు ముగ్గురే. అప్పటి బౌలింగ్ పరిస్థితులు.. ఆట నిబంధనలు అలాంటివి. ఒక మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టాడంటే అదో అద్భుతం.

 స్పిన్ బౌలింగ్ అంటే శివాలెత్తేవాడు..

స్పిన్ బౌలింగ్ అంటే శివాలెత్తేవాడు..

టీమిండియాలోనైతే నవజ్యోత్ సింగ్ సిద్దూ ధనాధన్ బ్యాటింగ్‌తో సిక్సర్ల సింగ్‌గా గుర్తింపు పొందగా.. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీనే విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సౌరవ్ గంగూలీ అయితే స్పిన్ బౌలింగ్ అంటే శివాలెత్తేవాడు. ముఖ్యంగా స్ట్రేట్ డ్రైవ్‌లో అతను కొట్టే సిక్స్ చూడ ముచ్చటగా ఉండేది. ఇప్పటికీ ఆ తరం అభిమానులు గంగూలీ పేరు చెప్పగానే మొదట చెప్పే మాట ఇదే. ఇక గంగూలీ.. జింబాబ్వే, శ్రీలంక, కెన్యా అంటే ఓ పునకంతో రెచ్చిపోయేవాడు. అతను కొట్టే బంతులు దాదాపు స్టేడియం బయటనే పడేవి. ఇప్పుడంటే జింబాబ్వే బలహీన జట్టు కావచ్చు కానీ.. అప్పట్లో ఓ బలమైన టీమ్. గట్టి పోటీనిచ్చే జట్టు.

షార్జాలో దాదాగిరి..

షార్జాలో దాదాగిరి..

అలాంటి గంగూలీ.. కొకకోలా చాంపియన్స్ ట్రోఫీ‌లో తన దాదాగిరి చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్లో మూడు బంతులు వదిలేసి మరో మూడు బంతులను సిక్స్‌లుగా మలిచిన తీరు అమోఘం. అతను కొట్టిన ప్రతీ బంతి మైదానం బయటే పడింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంటుంది. శ్రీలంక, జింబాబ్వే, భారత్ మధ్య జరిగిన ఈ ముక్కోణపు సిరీస్‌లో అజయ్ జడేజా నేతృత్వంలోని భారత జట్టే విజేతగా నిలిచింది.

 చెరొక విజయంతో..

చెరొక విజయంతో..

షార్జా వేదికగా జరిగిన ఈ ముక్కోణఫు సిరీస్‌లో జింబాబ్వే, భారత్ చేరో మూడు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరాయి. లీగ్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు తలపడ్డ ఈ ఇరు జట్లు చెరొకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన భారత్.. సచిన్ టెండూల్కర్(124 నాటౌట్), గంగూలీ(63 నాటౌట్) అద్భుత ప్రదర్శనతో పది వికెట్ల తేడాతో 120 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

Story first published: Monday, June 8, 2020, 22:32 [IST]
Other articles published on Jun 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+