Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాంఖడె స్టేడియంలో విరాట్ కోహ్లీ, వ్యానిటీ వ్యాన్‌లో అనుష్క

When Anushka Sharma wants to cheer for Virat Kohli but has to shoot for Zero too

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌కు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి హాజరు కాలేదు. అయినా సరే ముంబై-బెంగళూరు మ్యాచ్ మొత్తాన్ని వీక్షించిందంట.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఎలాగంటే... తన వ్యానిటీ వ్యాన్‌లోనే కూర్చుని ముంబై-బెంగళూరు మ్యాచ్‌‌ని వీక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కనే అభిమానులతో పంచుకోవడం విశేషం. టాస్ అనంతరం మ్యాచ్ ఆరంభానికి ముందు కోహ్లీ, రోహిత్‌ శర్మలు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దానిపై 'గో ఆర్‌సీబీ గో..కమాన్‌ బాయ్స్‌. బిజీగా ఉండడం వల్ల వ్యానిటీ వ్యాన్‌ నుంచే మ్యాచ్‌ వీక్షిస్తున్నాను' అని క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం అనుష్క షారుక్‌ ఖాన్‌కి జోడీగా 'జీరో' చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు.

దీని కారణంగానే ముంబై-బెంగళూరు మ్యాచ్‌కి అనుష్క హాజరు కాలేకపోయింది. మొన్న శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు-పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు అనుష్క శర్మ బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో నిలబడి మ్యాచ్‌ వీక్షిస్తున్న అనుష్క శర్మ.... విరాట్‌ కోహ్లీకి గాల్లో ముద్దులు విసిరిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ అనుష్కకు ఫోన్‌ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది.

Story first published: Wednesday, April 18, 2018, 15:38 [IST]
Other articles published on Apr 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+