న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Auction 2021 where to watch: అంతా ఆన్‌లైన్‌లోనే.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డిటైల్స్!

When and Where to Watch IPL 2021 Auction on TV, Online and Live Streaming Details
IPL 2021 Auction: Online & Live Streaming Details - Where To Watch, Time And All Details

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మినీ వేలం రేపు (గురువారం) చెన్నై వేదికగా జరగనున్నది. కరోనా కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో చాలా ఫ్రాంచైజీల కెప్టెన్లు, కోచ్‌లు సహా సీఈవో, డైరెక్టర్లు అందుబాటులో లేకుండా పోయారు. విదేశీ కోచ్, కెప్టెన్, సీఈవోలు కలిగిన ఫ్రాంచైజీలు ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి తమ అభ్యంతరాన్ని తెలిపాయి. విదేశీ ప్రయణాల లేనందున కనీసం ఆన్‌లైన్‌ ద్వారా వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరాయి.

షరతులతో అనుమతి..

షరతులతో అనుమతి..

ఐపీఎల్ వేలం ఎప్పుడు జరిగినా ఫ్రాంచైజీ తరఫున పరిమిత సంఖ్యలోనే సభ్యులను అనుమతిస్తారు. సాధారణంగా ఫ్రాంచైజీ యాజమాని, లేదంటే వారి తరఫున ఇద్దరితో పాటు కోచ్, కెప్టెన్, మెంటార్‌లు వేలానికి వచ్చేవారు. అయితే, చాలా ఫ్రాంచైజీలకు విదేశీ కచ్, సీఈవోలు ఉన్నారు. వాళ్లు వేలం కోసం ఒక రోజు రావడానికి 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాంతో కొన్ని ఫ్రాంచైజీలు తమ తరఫున వేలంలో పాల్గొనే వ్యక్తులను ఆన్‌లైన్ ద్వారా హాజరు కావడానికి అనుమతించాలని కోరాయి. దీనిపై రెండు రోజులుగా తర్జనభర్జనలు పడిన బీసీసీఐ ఎట్టకేలకు ఆన్‌లైన్ ద్వారా కేవలం పరిమిత సంఖ్యలో సభ్యులను అనుమతించడానికి ఒప్పుకున్నది. వేలంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనే వ్యక్తులు కేవలం క్రికెటర్లను కొనడానికి బెట్ చేయడం తప్పా, మిగతా వాటికి అనుమతించలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.

వేలంలో 292 మంది ప్లేయర్లు..

వేలంలో 292 మంది ప్లేయర్లు..

వేలంలో పాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు.

గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 11 స్థానాలు ఖాళీ ఉండగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్‌ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్‌ నుంచి హర్భజన్‌ సింగ్, కేదార్‌ జాదవ్‌, విదేశాల నుంచి.. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ను ఎవరు కొనుగోలు చేస్తారనేదే ఆసక్తిగా మారింది. అతను కనీస ధర రూ.20 లక్షలతో వేలంలో అందుబాటులో ఉన్నాడు.

మారింది ముగ్గురే..

మారింది ముగ్గురే..

అత్యధికంగా బెంగళూరు జట్టులో 11 స్థానాలు ఖాళీ ఉండగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్‌ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐపీఎల్ 2021 ప్లేయర్స్ ట్రేడింగ్‌కు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆల్‌రౌండర్లు డానియల్ సామ్స్, హర్షల్ టేల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ రెండు పూర్తిగా క్యాష్ డీల్స్ కావడం విశేషం. వీటి తర్వాత ట్రేడ్ ఆఫ్షన్‌ను మరే ఫ్రాంచైజీలు ఉపయోగించుకోలేదు.

మూడు గంటలకు షురూ..

మూడు గంటలకు షురూ..

గురువారం మధ్యాహ్నాం మూడు గంటలకు చెన్నై వేదికగా ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ట్ స్పోర్ట్స్ 3తోపాటు స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ట్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మినీ వేలం లైవ్ ఆన్‌లైన్ వేదికైన హాట్‌స్టార్‌లో కూడా వస్తుంది.

Story first published: Thursday, February 18, 2021, 10:34 [IST]
Other articles published on Feb 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X