Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా తదుపరి సిరీస్ ఎప్పుడు? ఎక్కడంటే..?

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దాంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగియడంతో టీమిండియా తదుపరి సిరీస్‌లు ఏంటా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. టీమిండియా తమ తదుపరి సిరీస్‌లను సొంత గడ్డపై ఆడనుంది. కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత పర్యటనకు రానుంది. అయితే ఈ సిరీస్‌ల ప్రారంభానికి ఇంకా 17 రోజుల సమయం ఉంది.

What s Next For Team India Series After BGT loss T20I And ODI Series Dates And Timings

ఐదు టీ20ల సిరీస్..
ముందుగా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 కోల్‌కతా వేదికగా జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో టీ20 చెన్నై వేదికగా జనవరి 25, మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 పుణే వేదికగా జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరగనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు దూరంగా ఉండనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన జట్టు ఈ సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది.

మహమ్మద్ షమీ రీఎంట్రీ
ఫిబ్రవరి 6నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ వన్డే సిరీస్‌ను టీమిండియా వామప్‌గా వాడుకోనుంది. ఈ సిరీస్‌లోని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేయనుంది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఈ సిరీస్ బరిలో దిగనున్నారు. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంలకు ప్రారంభం కానున్నాయి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్..
జనవరి 22, తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 22, రెండో టీ20(చెన్నై)
జనవరి 28, మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31, నాలుగో టీ20(పుణె)
ఫిబ్రవరి 2, ఐదో టీ20(ముంబై)

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్..
ఫిబ్రవరి 6-తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9-రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12-మూడో వన్డే(అహ్మదాబాద్)

Story first published: Sunday, January 5, 2025, 18:23 [IST]
Other articles published on Jan 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+