అతియా హాట్ ఫొటోకు రాహుల్ ఫిదా.. సమథింగ్ అంటున్న ఫ్యాన్స్!!

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే తాజాగా అతియా శెట్టి షేర్ చేసిన హాట్ ఫొటోలకు రాహుల్ కితాబివ్వడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
భయ్యా.. వదిన బాగుంది..
దేశంలో లాక్‌డౌన్ వేళ బ్యూటీ అతియా శెట్టి కొన్ని హాట్ ఫొటోలను‘పార్టీ ఆఫ్ టూ'అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ఫిదా అయిన రాహుల్ "నైస్ షర్ట్" అని మెచ్చుకున్నాడు. గల్లీబాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది చాలా హాట్‌గా ఉందనేలా ఫైర్ ఎమోజీ పెట్టాడు. రాహుల్ కామెంట్ చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరిని ఓ ఆటఆడుకుంటున్నారు. ‘రాహుల్, అతియా చొక్కాలేమైనా మార్చుకున్నారా?' అని ఒకరు సెటైరిక్‌గా కామెంట్ చేస్తే.. ఇంకొకరు బద్రర్ వదిన బాగుందని కామెంట్ చేశారు. అయితే ఈ ఫొటో షూట్‌ను వీడియో కాల్ ద్వారా తీయడం విశేషం. ప్రముఖ ఫొటోగ్రాఫర్ షాషా జైరామ్.. వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ ద్వారా ఈ ఫొటోలను తీశాడు.

మాకెలాంటి అభ్యంతరం లేదు..
ఇదిలా ఉండగా అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు అహాన్ ప్రేమిస్తున్న అమ్మాయి తనకూ ఇష్టమని పేర్కొన్నాడు. అలాగే అతియా ఎవరినైతే ఇష్టపడుతుందో.. అతనంటే కూడా తమకిష్టమేనన్నాడు. ఈ విషయంలో తనకు గానీ, తన భార్య మనాకు గానీ ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. పైగా వారి సంతోషమే కదా మాక్కావాల్సిందని చెప్పుకొచ్చాడు.

పార్టీలు.. విషెస్‌లు..
ఇక రాహుల్-అతియా న్యూ ఇయర్ వేడుకలు తమ ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ వేదికగా జరుపుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. రాహుల్ కూడా అథియాతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. అతియా బర్తేడే సందర్భంగా విషెస్ కూడా తెలిపాడు. దీనికిస్పందించిన అతియా.. 'లవ్' గుర్తు ఎమోజీలను పోస్ట్ చేసింది. అతియా ఫ్రెండ్ ఒకరు కూడా రాహుల్,అతియా కలిసి ఉన్న ఫోట్ షేర్ చేయడం కూడా వీరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చింది.

రాహుల్ ఫుల్ స్వింగ్‌లో
ఇక క్రికెట్ కెరీర్ పరంగా రాహుల్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ గడ్డపై పరుగుల మోత మోగించాడు. అటు కీపింగ్.. ఇటు బ్యాటింగ్‌లో ఆర్డర్ సంబంధం లేకుండా చెలరేగాడు. ఐదు టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న రాహుల్.. వన్డే సిరీస్‌లోనూ తన మార్క్ ఆటను చూపించాడు. అనంతరం టెస్ట్ జట్టులో లేకపోవడంతో ఆటకు దూరమైన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications