
పుణె: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను అతను వివాహమాడాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంత సీక్రెట్ మెయింటేన్ చేశారంటే.. వారు షేర్ చేసేవరకు వారి పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వీరికి వివాహం జరుగుతుందనే ఎవరూ ఊహించలేదు.
బుమ్రా బ్రేక్ చేసుకోగానే అతని పెళ్లనే అంతా ఊహించారు. కానీ సంజనా గణేశన్‌తో ఉన్న ప్రేమయాణాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఎంతసేపు సౌతిండియా హీరోయిన్ అనుపమా పరమేశ్వరణ్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడనే పుకార్లు వినిపించాయి. కానీ సంజనా గురించి ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈ వివాహం నేపథ్యంలోనే బుమ్రా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
అయితే సంజనా గణేశన్ మాత్రం తిరిగి తన వర్క్‌ను ప్రారంభించింది. తాజాగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. టీవీల్లో సంజనాను చూసి అభిమానులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బుమ్రా ఇంకా రెస్ట్‌లో ఉండగా.. సంజనా మాత్రం తన వర్క్ ప్రారంభించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సంజనా వచ్చి వర్క్ చేస్తుంటే.. బుమ్రా ఒక్కడు ఏం చేస్తున్నాడని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజనా.. గతంలో 2019 ప్రపంచకప్, ఐపీఎల్‌లకు కూడా హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(79 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 66) మరోసారి సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 158 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కేఎల్ రాహుల్(65 బ్యాటింగ్), రిషభ్ పంత్(2 బ్యాటింగ్) ఆడుతున్నారు.