Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Under-19s Asia Cup: భారత్ X శ్రీలంక సెమీఫైనల్ మ్యాచ్‌ రద్దయితే..?

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకే ఐసీసీ అకాడమీ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికీ ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంది. దాంతోనే ఈ మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ సెమీ ఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోవడంతో వర్షం రద్దయితే పరిస్థితి ఏందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ రద్దయితే రూల్స్ ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన గ్రూప్-ఏ టాపర్ అయిన భారత్ ఫైనల్ చేరనుండగా.. శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఆదివారం ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

What Happens If the India vs Sri Lanka U19 Asia Cup 2025 Final Is Cancelled

బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య ది సెవెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, December 19, 2025, 15:26 [IST]
Other articles published on Dec 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+