విండీస్ ఆటగాళ్లకు బంపరాఫర్.. ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలిస్తే!!

ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ జట్టుకి ఆ దేశ బోర్డు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్లూఐ) బంపరాఫర్ ప్రకటించింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిస్తే మంచి బోనస్ ఇస్తామని సీడబ్లూఐ తాజాగా ప్రకటించింది. సౌథాంప్టన్ వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం మొదలవడంతో ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకతను సంచరించుకుంది.

సంచలన విజయం నమోదు చేస్తుందని
క్రికెట్ వెస్టిండీస్ గత కొంతకాలంగా ఆటగాళ్లకి మ్యాచ్ ఫీజుల్ని చెల్లించేందుకు ఇబ్బందిపడుతోంది. విండీస్ క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో లభించే డబ్బు కూడా చాలా తక్కువ. దాంతో సునీల్ నరైన్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రసెల్ తదితర స్టార్ క్రికెటర్లు వెస్టిండీస్ తరఫున ఆడటం కంటే.. ప్రైవేట్ టీ20ల్లో ఆడేందుకు ఇష్టపడుతున్నారు. బోర్డులో రాజకీయాలు కూడా వారిని జట్టుకి మరింత దూరం చేశాయి. అయితే టెస్టుల్లో అంతంత మాత్రమే రాణించే విండీస్.. ఇంగ్లండ్ గడ్డపై సంచలన విజయం నమోదు చేస్తుందని బహుశా క్రికెట్ వెస్టిండీస్ కూడా ఊహించలేదు.

విండీస్ జట్టుకి బోనస్
ఇంగ్లండ్ టూర్‌లో బోణి కొట్టిన వెస్టిండీస్ జట్టులో మరింత ఉత్సాహం నింపే ఉద్దేశంతో క్రికెట్ వెస్టిండీస్ తాజాగా ఆటగాళ్లకు బోనస్ ప్రకటించింది. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిస్తే.. విండీస్ జట్టుకి సుమారు రూ. 23 లక్షలు బోనస్‌గా ఇవ్వనున్నట్లు సీడబ్లూఐ ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం వెస్టిండీస్ టెస్టు జట్టులో ఉన్న చాలా మంది క్రికెటర్లు ప్రైవేట్ టీ20 లీగ్‌లకి ఎంపికకాపోవడంతో వారికీ ఈ మొత్తం దక్కితే పండగే.

ఆదుకున్న బ్లాక్‌వుడ్
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత జరిగిన తొలి బయోబబుల్ టెస్టు విజయవంతం అయింది. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో విండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు జెర్నేన్ బ్లాక్‌వుడ్ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్‌వుడ్‌తో పాటు కెప్టెన్ జేసన్ హోల్డర్, షెనాన్ గాబ్రియేల్ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ల పనిపట్టారు. రెండో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుంది.
'బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే కోహ్లీ చెలరేగుతాడు.. విలియమ్సన్ మాత్రం..'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications