Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే కోహ్లీ చెలరేగుతాడు.. విలియమ్సన్‌ మాత్రం..'

Glenn Turner Would Back Kane Williamson Over Virat Kohli In Tougher Batting Conditions

డునెడిన్ (న్యూజిలాండ్): టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే చెలరేగుతాడని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేస్‌, స్వింగ్‌, చల్లని పరిస్థితులుండే మైదానాల్లో‌ బాగా ఆడతాడని పేర్కొన్నాడు. కోహ్లీ, విలియమ్సన్ వారిద్దరూ భిన్నమైన వాతావరణంలో క్రికెట్‌ ఆడుతూ ఎదిగారని.. కఠిన పరిస్థితుల్లో విరాట్ బదులు తాను కేన్‌ను ఎంచుకుంటానని టర్నర్‌ చెప్పాడు.

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే చెలరేగుతాడు

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే చెలరేగుతాడు

గ్లెన్‌ టర్నర్ తాజాగా టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ అద్భుతమైన ఆటగాళ్లు. అయితే వారి వ్యక్తిత్వాలు, అలవాటు పడ్డ పరిస్థితులు భిన్నమైనవి. కోహ్లీకి చిన్నతనం నుంచి బంతి స్వింగ్‌ అయ్యే, సీమింగ్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. విలియమ్సన్‌కు అదే పిచ్‌లపై అనుభవం ఎక్కువ. కోహ్లీ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడు. పేస్‌, స్వింగ్‌కు ఎక్కువగా అనుకూలించని వికెట్లపై అతడు దూకుడుగా ఆడతాడు. బౌలర్‌పై ఆధిపత్యం చెలాయిస్తాడు' అని అన్నాడు.

కఠిన పరిస్థితుల్లో కేన్‌ను ఎంచుకుంటా

కఠిన పరిస్థితుల్లో కేన్‌ను ఎంచుకుంటా

'వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీలా కేన్ విలియమ్సన్‌ దూకుడుగా ఉండడు. అయితే విజయం సాధించాలన్న తపన తక్కువగా ఉంటుందని నేను అనట్లేదు. గెలవాలన్న ప్రేరణ ఇద్దరికీ ఒకేలా ఉంటుంది. జట్టు గెలుపు కోసం ఇద్దరు 100 శాతం ప్రయత్నిస్తారు. కఠిన పరిస్థితుల్లో మాత్రమే విరాట్ బదులు కేన్‌ను ఎంచుకుంటా' అని టర్నర్‌ పేర్కొన్నాడు. విరాట్‌ ఇప్పటి వరకు 86 టెస్టులు ఆడగా 53.62 సగటుతో 7,240 పరుగులు చేయగా.. విలియమ్సన్‌ 80 టెస్టుల్లో 51.63 సగటుతో 6,476 పరుగులు చేయడం గమనార్హం.

33 శతకాలు:

33 శతకాలు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు. విలియమ్సన్‌ కివీస్ తరఫున 151 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. విలియమ్సన్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 33 శతకాలు బాదాడు.

Story first published: Wednesday, July 15, 2020, 13:25 [IST]
Other articles published on Jul 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+