100 పరుగులకు ఆలౌట్.. వెస్టిండీస్ ఖాతాలో చెత్త రికార్డు!!

ఆంటిగ్వా: కరీబియన్ పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ అంజిక్య రహానే (102; 242 బంతుల్లో 5×4).. బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్‌లు జస్ప్రీత్ బుమ్రా (5/7), ఇషాంత్ శర్మ (3/31) విజృంభించడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 100 పరుగులకే ఆలౌట్ అయింది. కీమర్ రోచ్ (38; 31బంతుల్లో 1×4, 5×6) రాణించడంతో విండీస్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది.

ఇదే అత్యల్ప స్కోరు:
100 పరుగులకు ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటివరకూ భారత్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లలో విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు 2006లో కింగ్‌స్టన్‌లో 103 పరుగులకు విండీస్ ఆలౌట్ అయింది. తొలి టెస్టులో ఆదివారం 100 పరుగులకే చేతులెత్తేసి.. 13 ఏళ్ల రికార్డును సవరించింది. దీంతో భారత్‌పై విండీస్ నమోదు చేసిన అత్యల్ప స్కోర్లలో తాజా ఇన్నింగ్స్ తొలి స్థానానికి చేరింది.
అత్యుత్తమ విజయం:
తొలి టెస్టులో భారత్ 318 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా చూసుకుంటే విండీస్ జట్టుపై భారత్‌కిదే అత్యుత్తమ విజయం. 1988 జనవరిలో చెన్నైలో జరిగిన టెస్టులో విండీస్‌పై 255 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును భారత్ సవరించింది. ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.

బెంబేలెత్తించిన బుమ్రా:
భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా దెబ్బకు ఓపెనర్లు బ్రాత్‌వైట్ (1), క్యాంప్‌బెల్ (7) పది పరుగులకే పెవిలియన్‌కు చేరారు. బ్రూక్స్ (2)ను ఇషాంత్ అవుట్ చేయడంతో విండీస్ 10/3తో నిలిచింది. అనంతరం హెట్‌మయర్ (1)ను ఇషాంత్ ఔట్ అవుట్ చేయగా.. డారెన్ బ్రావో (2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

చివరి వికెట్‌కు 50 పరుగులు:
వైరం అనంతరం హోప్ (2), హోల్డర్ (8)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఛేజ్ (12), గాబ్రియెల్ (0)ను షమీ వెనక్కుపంపాడు. చివర్లో రోచ్ (38) కొంతసేపు ప్రతిఘటించాడు. రోచ్, కమిన్స్ చివరి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రోచ్‌ను ఇషాంత్ ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఏ ఒక్కరు కూడా కనీసం 20 బంతులాడలేకపోయారు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఛేజ్(12), రోచ్ (38), కమిన్స్ (19 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 7 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్: సింధు తల్లి