న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను వికెట్లు తీయకున్నా.. జట్టు మ్యాచ్ గెలిస్తే సంతోషం: బుమ్రా

West Indies vs India: I am Fine if I Don’t Get Wickets says Jasprit Bumrah

కింగ్‌స్టన్: నేను వికెట్లు తీయకున్నా పెద్దగా నిరాశ చెందను, జట్టు మ్యాచ్ గెలిస్తే సంతోషంగా ఉంటా అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరొన్నాడు. తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్‌ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

<strong>వెస్టిండీస్‌తో రెండో టెస్టు: కోహ్లీ 'గోల్డెన్‌ డక్‌'.. ఇది ఎన్నోసారంటే?</strong>వెస్టిండీస్‌తో రెండో టెస్టు: కోహ్లీ 'గోల్డెన్‌ డక్‌'.. ఇది ఎన్నోసారంటే?

ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతా:

ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతా:

మూడో రోజు మ్యాచ్ అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడుతూ... 'నేను వికెట్లు తీయకున్నా నిరాశ చెందను. జట్టు మ్యాచ్ గెలిస్తే సంతోషంగా ఉంటా. నేను వికెట్లు తీయకున్నప్పటికీ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతా. జట్టు విజయానికి నా వంతు ప్రయత్నం చేస్తా. జట్టుకు ఏవిధంగా నేను సహకరించగలను అని ఆలోచిస్తా. మొత్తానికి జట్టు విజయం సాధించడమే అంతిమ లక్ష్యమని' అని బుమ్రా తెలిపాడు.

అందరితో చర్చిస్తా:

అందరితో చర్చిస్తా:

'జట్టులో సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇషాంత్ అందరికంటే ఎక్కువ క్రికెట్ ఆడాడు. షమీ కూడా. నేను కొత్త వాడిని కాబట్టి ఇషాంత్, షమీలకు నా వంతు సాయం చేస్తా. గతంలో ఇక్కడ ఆడిన అనుభవం వారికి ఉంది కాబట్టి ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుంటా. వికెట్ సహకరించకపోతే ఎలా బంతులు వేయాలో వారిని అడుగుతా. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రణాళికలు ఉంటాయి కాబట్టి అందరితో చర్చిస్తా. అందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం' అని బుమ్రా పేర్కొన్నాడు.

తొలి శతకం నాన్నకు అంకితం.. ఎక్కడున్నా ఆయన గర్వించే ఉంటారు: విహారి

పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు:

పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు:

'నేను ఇంగ్లాండ్‌లో చాలా క్రికెట్ ఆడాను. డ్యూక్ బంతితో బౌలింగ్ చేశా. అప్పుడు ఔట్ స్వింగ్, ఇన్‌ స్వింగ్ బంతులు వేయడంతో మరింత విశ్వాసం పెరిగింది. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడింది. మునుపటి ఇన్నింగ్స్ కంటే ఇప్పుడు వికెట్ కొంచెం మెరుగ్గా ఉంది. అన్ని వైపుల నుండి ఒత్తిడిని సృష్టించాలి. తద్వారా మేము మ్యాచ్ శాసించే స్థితిలో ఉండటానికి సహాయపడుతుంది. కెప్టెన్ మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు' అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 2, 2019, 15:24 [IST]
Other articles published on Sep 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X