Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

257 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్‌ క్లీన్ స్వీప్

Ind vs WI 2nd Test, Highlights : India Complete Facile Win Over Windies For 2-0 Series Sweep
West Indies vs India, 2nd Test: Ravindra jadeja, Mohammad Shami help India complete series sweep

కింగ్‌స్టన్‌: ఎటువంటి సంచనాలు నమోదు కాలేదు. అందరూ ఊహించినట్టుగానే టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. దీంతో వెస్టిండీస్ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. మొదట టీ20, ఆ తర్వాత వన్డే.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఈ పర్యటనను పరిపూర్ణంగా పూర్తి చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలిచింది. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ను 257 పరుగుల భారీ తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

పోరాడిన బ్రూక్స్‌:

పోరాడిన బ్రూక్స్‌:

468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. 45/2 ప‌రుగుల‌తో నాలుగోరోజు ఆటు మొద‌లు పెట్టిన విండీస్ మొద‌ట వికెట్లను కాపాడుకుంది. అనంతరం ఛేజ్ (12), హెట్మయర్ (1) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రూక్స్‌ (50) జట్టును ఆదుకున్నాడు. బ్లాక్‌వుడ్‌ (38)తో కలిసి బ్రూక్స్‌ అద్భుతంగా పోరాడాడు. బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌ జోడి భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. దీంతో విండీస్ లంచ్ సమయానికి 145/5తో నిలిచింది.

జడేజా మాయ:

జడేజా మాయ:

బ్లాక్‌వుడ్‌ను బుమ్రా ఔట్ చేసి ఈ జోడీని విడదీసాడు. బ్రూక్స్‌ మాత్రం పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ చేసాడు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం హామిల్టన్ (0), కార్న్ వాల్ (1), రోచ్ (5) తక్కువ పరుగులకే పరిమితం అయ్యారు. చివరలో హోల్డర్‌(39), బ్రేవో(23) పరుగులు చేశారు. షమీ, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా.. బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. మూడో రోజు విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్ (3), క్యాంప్‌బెల్‌ (16) పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే.

15 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్:

15 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్:

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 6 వికెట్లు తీయగా.. షమీ 2 వికెట్లు తీసాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 168/4 వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం హనుమ విహారి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ విజ‌యంతో కోహ్లీ సేన 120 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఈ నెల 15 నుంచి దక్షిణాఫ్రికా- భార‌త్‌ల సిరీస్ మొదలుకానుంది.

Story first published: Tuesday, September 3, 2019, 10:13 [IST]
Other articles published on Sep 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+