వెస్టిండీస్‌తో రెండో టెస్టు: కోహ్లీ 'గోల్డెన్ డక్'.. ఇది ఎన్నోసారంటే?

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'గోల్డెన్ డక్' అయ్యాడు. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా ఫాలోఆన్ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) త్వరగానే ఔట్ కాగా.. క్రీజులో నిలిచేందుకు యత్నించిన లోకేశ్ రాహుల్ (63 బంతుల్లో 6) పెవిలియన్ చేరాడు.

నాలుగో గోల్డెన్ డక్:
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0).. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో గోల్డెన్ డక్ కావడం కోహ్లీకి ఇది నాలుగోసారి. 2011-12లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో తొలిసారి గోల్డెన్ డక్ అయ్యాడు. 2014లో ఇంగ్లాండ్‌పై , 2018లో ఇంగ్లాండ్‌పైనే గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌పై నాలుగోసారి పెవిలియన్ చేరాడు. అయితే మొత్తం తొమ్మిది సార్లు టెస్టుల్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు.

భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం:
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. భారత్ మూడో రోజే ఆఖరి టెస్టును శాసించే స్థితిలో నిలిచింది. ఇక భారత్ విజయానికి కేవలం 8 వికెట్ల దూరంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 87/7తో మూడోరోజు ఆట కొనసాగించిన విండీస్ మరో 30 పరుగులు చేసి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు షమీ విజృంభించాడు. షమీ, బుమ్రా ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 299 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

రహానే, విహారి అర్ధ సెంచరీలు:
అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (4), లోకేశ్ రాహుల్ (63 బంతుల్లో 6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చతేశ్వర్ పుజరా.. అజింక్య రహానేలు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. హోల్డర్ వేసిన బౌన్సర్‌కు పుజారా (27) ఔటయ్యాడు. ఈ సమయంలో రహానేకు విహారి తోడయ్యాడు. ఇద్దరూ విండీస్ బౌలర్లను ఎదుర్కుంటూ అర్ధ సెంచరీలు చేశారు. ఈ జోడి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు. దీంతో భారత్ 467 పరుగుల ఆధిక్యం సాధించింది.
తొలి శతకం నాన్నకు అంకితం.. ఎక్కడున్నా ఆయన గర్వించే ఉంటారు: విహారి

విండీస్ విజయానికి 423 పరుగులు:
468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా విండీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. బ్రాత్‌వైట్ (3) ఇషాంత్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ (16) డారెన్ బ్రేవోతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేసాడు. కానీ.. షమీ వేసిన అద్భుత బంతికి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో.. బ్రూక్స్‌తో కలిసి బ్రేవో వికెట్లను అడ్డుకున్నాడు. ఆట ముగిసే సమయానికి క్రీజులో బ్రేవో(18), బ్రూక్స్ (4) ఉన్నారు. విండీస్ విజయానికి ఇంకా 423 పరుగులు అవసరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications