13 ఏళ్ల తర్వాత బుమ్రా హ్యాట్రిక్.. మూడో భారత బౌలర్‌గా రికార్డు!!

కింగ్‌స్టన్: తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్ రుచి చూపించిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో టాప్-5 బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అంతేకాదు హ్యాట్రిక్ ఉండటం విశేషం. హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.

బుమ్రా హ్యాట్రిక్:
భారత్ ఆలౌట్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. ఏడో ఓవర్లోనే ఓపెనర్ క్యాంప్‌బెల్ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసాడు. తొమ్మిదో ఓవర్ రెండో బంతికి డారెన్ బ్రావో (4)ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి బ్రావో బ్యాట్‌ను టచ్ చేస్తూ.. స్లిప్‌లో ఉన్న రాహుల్ చేతిలో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్స్ (0) వికెట్ల ముందు దొరికి పోయాడు. అనంతరం చేజ్ (0) కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీ ఔట్ అయ్యాడు. బుమ్రా 9వ ఓవర్లో 3,4,5, బంతులకు హ్యాట్రిక్ సాధించాడు.

13 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్:
టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున బుమ్రా సాధించిన ఈ హ్యాట్రిక్ మూడోది. అంతకుముందు 2001లో స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాక్‌పై హ్యాట్రిక్ రికార్డు సాధించాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు.

16 పరుగులు.. 6 వికెట్లు:
బుమ్రా కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. బ్రాత్‌వైట్ (4), క్యాంప్‌బెల్ (2), డారెన్ బ్రేవో(4), బ్రూక్స్ (0), రోస్టన్ ఛేజ్(0), హోల్డర్ (18)లు బుమ్రా బౌలింగ్ ధాటికి బలయ్యారు. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా బుమ్రా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ఇది 5వ సారి.
అభిషేక్ అదుర్స్.. జైపూర్‌పై ముంబా విజయం

భారీ ఆధిక్యంలో భారత్:
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. హనుమ విహారి (225 బంతుల్లో 16 ఫోర్లతో 111) సెంచరీ.. ఇషాంత్ శర్మ (80 బంతుల్లో 7 ఫోర్లతో 57), విరాట్ కోహ్లీ (163 బంతుల్లో 10 ఫోర్లతో 76) అర్ధ సెంచరీలు చేశారు. హోల్డర్‌కు ఐదు, కార్న్‌వాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 33 ఓవర్లలో 87 పరుగులకు 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం హామిల్టన్ (2), కార్న్‌వాల్(4) క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ వెనకబడి ఉంది. ఈ రోజు విండీస్ ఫాలో ఆన్ ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications