For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విహారి సెంచరీ.. నిప్పులు చెరిగిన బుమ్రా.. కష్టాల్లో విండీస్

West Indies vs India, 2nd Test: Hanuma Vihari, Jasprit Bumrah stars as Windies end Day 2 at 87/7

కింగ్‌స్టన్‌: రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి టెస్టులో వెస్టీండీస్‌పై ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టుపై పూర్తి పట్టు బిగించింది. మొదటగా తెలుగు తేజం హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ చేయడంతో భార‌త్ భారీ స్కోర్ చేసింది. అనంతరం తొలి టెస్టులో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన జస్ప్రిత్‌ బుమ్రా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో రెచ్చిపోయాడు. దీంతో ఆతిథ్య జట్టు ఫాలోఆన్‌ గండం ఎదుర్కొనే అవకాశం ఉంది.

తొలి బంతికే షాక్:

తొలి బంతికే షాక్:

264/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. హోల్డర్‌ వేసిన తొలి బంతికే రిషభ్‌ పంత్‌ (27) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం హనుమ విహారికి జడేజా (15) కాసేపు అండగా నిలిచాడు. అయితే కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి జడేజా అవుటయ్యాడు. ఈ దశలో ఇషాంత్‌ విహారికి పూర్తి సహకారం అందించాడు.

ఇషాంత్‌ సూపర్:

ఇషాంత్‌ సూపర్:

పేసర్లు గాబ్రియెల్‌, రోచ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇషాంత్, విహారి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. దీంతో రన్స్‌ రావడం కష్టంగా మారింది. విహారి మాత్రం ఓ ఓవర్‌లో మూడు ఫోర్లతో చెలరేగి స్కోరులో కదలిక తెచ్చాడు. మరో ఎండ్‌లో ఇషాంత్‌ ఆత్మవిశ్వాసంతో బంతులను ఎదుర్కొని పరుగులు చేసాడు. ఇక 116వ ఓవర్‌లో విహారిని అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా.. రివ్యూకు వెళ్లి బతికిపోయాడు. 336/7 స్కోరుతో భారత్ లంచ్‌ విరామానికి వెళ్ళింది.

విహారికి తొలి టెస్ట్ సెంచరీ:

విహారికి తొలి టెస్ట్ సెంచరీ:

విరామం అనంతరం ఇషాంత్‌ ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా హోల్డర్‌ను లక్ష్యంగా చేసుకుని అతడి వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదాడు. మరోవైపు విహారి నెమ్మదించినా 200 బంతుల్లో శతకం పూర్తి చేసాడు. ఇది విహారికి తొలి టెస్ట్ సెంచరీ. మరోవైపు ఇషాంత్‌ అర్ధ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో 112 పరుగుల భాగస్వామ్యంకు తెరపడింది. ఇషాంత్ అంనతరం భారత్ 2 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి 140.1 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ ఐదు వికెట్లు, రకీమ్ కార్న్‌వాల్ మూడు వికెట్లు పడగొట్టారు.

బుమ్రా హ్యాట్రిక్:

బుమ్రా హ్యాట్రిక్:

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌కు బుమ్రా తన పేస్‌ రుచి చూపించాడు. ఏడో ఓవర్లోనే ఓపెనర్ క్యాంప్‌బెల్‌ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. డారెన్‌ బ్రేవో(4), బ్రూక్స్‌(0), రోస్టన్‌ ఛేజ్‌(0)లను ఔట్ చేసాడు. బ్రాత్‌వైట్ కూడా బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో విండీస్‌ను హెట్‌మెయిర్‌ (34) ఆదుకున్నాడు. అయితే షమీ అతన్ని ఔట్ చేసాడు.

గుజరాత్‌ ఆల్‌రౌండ్ షో.. సొంతగడ్డపై బుల్స్‌కు షాక్

ఫాలో ఆన్ ఆడే అవ‌కాశం:

ఫాలో ఆన్ ఆడే అవ‌కాశం:

రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం హామిల్టన్‌ (2 బ్యాటింగ్‌), కార్న్‌వాల్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగాడు. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ వెనకబడి ఉంది. ఈ రోజు విండీస్ ఫాలో ఆన్ ఆడే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

Story first published: Sunday, September 1, 2019, 12:28 [IST]
Other articles published on Sep 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+