
ఆరేళ్ల తర్వాత రాంపాల్‌కు చోటు
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పేసర్ రవి రాంపాల్‌కు వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 2010 టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న రవి రాంపాల్.. చివరగా టీ20 వరల్డ్ కప్ 2015లో ఆడాడు. హెడెన్ వాల్ష్ జూనియర్‌కు జట్టులో చోటు దక్కింది. సీనియర్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్ తమ స్థానాలను నిలుపుకున్నారు.
ఇక విండీస్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు 15 మందిలో చోటు దక్కలేదు. అయితే అతనికి రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో స్థానం కల్పించారు. డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్‌లకు కూడా రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కింది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు కూడా పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు.

జట్టునిండా హిట్టర్లే
టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు అయిన వెస్టిండీస్ టీంలో జట్టునిండా హిట్టర్లే ఉన్నారు. దాంతో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. క్రిస్ గేల్, లెండి సిమన్స్, షిమ్రన్ హెట్‌మైర్, రోస్టన్ చేజ్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, ఫాబియన్ అలెన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఒషానే థామస్, హెడెన్ వాల్ష్ రూపంలో మంచి పేసర్లు కూడా ఉన్నారు.

ఇంగ్లండ్‌తో విండీస్ మొదటి మ్యాచ్
ప్రతీ జట్టు తమ టీంను అక్టోబర్ 10 వరకు మార్చుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని జట్లు చాలా వరకు తమ జట్టును ఫైనల్ చేశాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ 1లో ఉన్న వెస్టిండీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టను ఎదుర్కోనుంది. డెత్ గ్రూఫ్‌గా పరిగణిస్తున్న ఈ గ్రూఫ్‌లో విండీస్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక పొట్టి క్రికెట్‌లో విండీస్ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ కొట్టేందుకు తహతహలాడుతోంది.

వెస్టిండీస్ టీ20 జట్టు
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒషానే థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్.
స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్.


Click it and Unblock the Notifications

Jaskaran Malhotra: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఈసారి బాదింది మనోడే! వామ్మో.. 16 సిక్సులు బాదాడుగా (వీడియో)!!










