బ్రావో క్యాచ్ పట్టుకున్నా
మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ (30: 31 బంతుల్లో 2x4) అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఇక గేర్ మార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని లాంగాన్ దిశగా సిక్స్ కోసం ఫించ్ హిట్ చేశాడు. బాగా ఎత్తులోకి వెళ్లిన బంతి బౌండరీ లైన్ వద్ద పడేలా కనిపించింది. ఫీల్డర్ డ్వేన్ బ్రావో పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టాడు. కానీ అతని చేతి నుంచి బౌన్స్ అయిన బంతి కింద పడిపోతుండగా మళ్లీ దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు.

పక్కకి డైవ్ చేస్తూ
మరోసారి క్యాచ్ అందుకుందామనుకున్న డ్వేన్ బ్రావో ప్రయత్నం ఫలించలేదు. బ్రావో చేయి తాకిన బంతి పక్కకి బౌన్స్ అయ్యింది. అయితే మిడ్ వికెట్ నుంచి అప్పటికే బ్రావోని సమీపించిన మరో ఫీల్డర్ ఫాబియన్ అలెన్.. రెప్పపాటులో పక్కకి డైవ్ చేస్తూ ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దాంతో వెస్టిండీస్ ఊపిరి పీల్చుకుంది.
సమయస్పూర్తితో వ్యవహరించిన అలెన్.. బంతికి కాస్త దూరంలో ఉన్నా తన కాళ్లను స్ట్రెచ్ చేస్తూ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్ ప్లేయర్ తెలివికి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ క్యాచ్, స్టన్నింగ్ క్యాచ్ అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Tokyo Olympics 2021: అథ్లెట్లకు బంపర్ ఆఫర్.. గోల్డ్ గెలిస్తే 6 కోట్లు! మరో సీఎం ప్రకటన!

గేల్ చెలరేగడంతో
ఈ మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చెలరేగడంతో విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో హెన్రిక్స్ 33, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 30 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 3, ఆండీ రసెల్ 2 వికెట్లు తీశారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. గేల్ (38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు)తో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. దీంతో విండీస్ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications












