For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rahkeem Cornwall: టీ20ల్లో డబుల్ సెంచరీ.. 26 సిక్స్‌లతో విధ్వంసం!

West Indies opener Rahkeem Cornwall smashes unbeaten T20 double century in USAs Atlanta Open

న్యూఢిల్లీ: వెస్టిండీస్ భారీ కాయుడు, విధ్వంసకర బ్యాటర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20ల్లో డబుల్ సెంచరీ బాదాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్‌లో.. అట్లాంటా ఫైర్ తరఫున బరిలోకి దిగిన అతను స్క్వేర్ డ్రైవ్‌ జట్టుపై 77 బంతుల్లో 205 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 26 సిక్సులు, 17 ఫోర్లతో పరుగుల విధ్వంసం సృష్టించాడు. 266కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. దీంతో అట్లాంటా జట్టు 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ తరఫున బరిలోకి దిగే కార్న్‌వాల్ భారీ సిక్సులు బాదడంలో సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే.

కార్న్‌వాల్ షాట్లు ఆడిన వీడియోను ట్వీట్ చేసిన 'మైనర్ లీగ్ క్రికెట్' మీరు ఎంటర్‌టైన్ కాలేదా.? అని క్రికెట్ అభిమానులను అడిగింది. ఇటీవలే కార్న్‌వాల్ మాట్లాడుతూ... సిక్స్‌లు కొట్టడం తనకు సహజంగా అలవాటు అయ్యిందని, తాను 360 డిగ్రీ ప్లేయర్‌నని చెప్పాడు. ఆత్మ విశ్వాసమే తన విజయ రహస్యమన్నాడు. షాట్ల ఎంపికపై తాను దృష్టి సారిస్తే సరిపోతుందని.. బంతి నా ఏరియాలోకి వచ్చేంత వరకు వేచి చూసి బాదితే సరిపోతుందన్నాడు. ఒక రోజు 11 సిక్సులు బాదితే.. మరో రోజు తొలి బంతికే ఔట్ కావచ్చు. కానీ ఓ ఆటగాడిగా మనపై మనకు నమ్మకం ఉండాలని కార్న్‌వాల్ తెలిపాడు.

కార్న్‌వాల్ విషయాన్ని పక్కనబెడితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుర్తింపు పొందాడు. 2018 జులై 3న హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఫించ్ 16 ఫోర్లు, 10 సిక్సులు బాదాడు. లీగ్‌లు కూడా కలుపుకుంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ గుర్తింపు పొందాడు. 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన క్రిస్ గేల్.. పుణే వారియర్స్‌పై 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో గేల్ మొత్తం 13 ఫోర్లు, 17 సిక్సులు బాదాడు. ఆ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే సెంచరీ చేసిన గేల్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. తాజాగా ఈ రికార్డులను కార్న్‌వాల్ అధిగమించాడు.

Story first published: Thursday, October 6, 2022, 12:58 [IST]
Other articles published on Oct 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+