ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వెస్టిండీస్ బంపర్ ఆఫర్!!

లండన్: కరోనా భయంతో ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. కొన్ని టోర్నీలు రద్దవ్వగా మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
జూన్‌లో ఇంగ్లండ్, విండీస్ మధ్య జరగాల్సిన మూడు టెస్ట్‌ల సిరీస్‌తో పాటు, జూలై నెలాఖరులో ప్రారంభమయ్యే ఇంగ్లండ్, పాకిస్థాన్ సిరీస్‌లకు ఆతిథ్యమివ్వడానికి తాము సిద్ధమని కరీబియన్ బోర్డు ప్రకటించింది.
ఈ అంశానికి సంబంధించి ఈసీబీ చీఫ్ టాప్ హారిసన్‌తో ఇప్పటికే పలుమార్లు మాట్లాడనని టోర్నీల నిర్వహణకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని విండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్ తెలిపారు.
అయితే ఈ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం కాదని, కష్ట సమయంలో క్రికెట్ కమ్యూనిటీలో ఒకరికొకరు అండగా ఉంటేనే అద్భుతాలు సాధ్యమని గ్రేవ్ స్పష్టం చేశాడు. కాగా వెస్టిండీస్‌లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే యూరప్ దేశాలతో పోలిస్తే కరీబియన్‌లో కొవిడ్ ప్రభావం చాలా తక్కువగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications