Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్లకే ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.. కానీ ఆ ప్రవర్తన సరికాదు: దిగ్గజం క్లైవ్ లాయిడ్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే తన అద్వితీయమైన బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడని కొనియాడాడు. అతని హిట్టింగ్ సామర్థ్యం అమోఘమని, భవిష్యత్తు సూపర్ స్టార్ కావడం ఖాయమని ప్రశంసించాడు.

సంచలన ప్రదర్శనతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగే తొలి టీ20తో అతను అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల శ్రీలంక పర్యటనలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ నుంచి టీమిండియా జెర్సీని కూడా అందుకున్నాడు. అతను జెర్సీ నెంబర్ 3తో బరిలోకి దిగనున్నాడు.

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

గుడ్డిగా ఆడటం లేదు..

వైభవ్ సూర్యవంశీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లైవ్ లాయిడ్.. అతని బ్యాటింగ్‌ను కొనియాడుతూనే పలు సలహాలు ఇచ్చాడు. 1975, 1979 ప్రపంచకప్ విజేత అయిన క్లైవ్ లాయిడ్ .. వైభవ్ కేవలం బంతిని బలంగా బాదడమే కాకుండా, అద్భుతమైన టైమింగ్‌తో లాసిక్ షాట్లు ఆడుతున్నాడని విశ్లేషించాడు.

West Indies Legend Clive Lloyd Heaps Praise On 15-Year-Old Indian Prodigy Vaibhav Sooryavanshi

'వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన ఆటగాడు. ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు. వైభవ్ బంతిని ఎంతో సునాయసంగా బౌండరీలు తరలిస్తున్నాడు. అతను ఏమాత్రం గుడ్డిగా ఆడటం లేదు. టెక్నిక్, టైమింగ్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. చాలా సార్లు కోచ్‌లు యువ ఆటగాళ్ల సహజ శైలిని మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వైభవ్ విషయంలో ఆ తప్పు చేయవద్దు. అతన్ని స్వేచ్ఛగా ఆడనివ్వాలి.’అని క్లైవ్ లాయిడ్ హితవు పలికాడు.

మంచి పోరు అయ్యేది..

మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, ఆండీ రాబట్ట్స్, కోలిన్ క్రాఫ్ట్ వంటి తన కాలంలోని భీకరమైన వెస్టిండీస్ పేస్ విభాగాన్ని వైభవ్ ఎదుర్కొని ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించినప్పుడు వైభవ్‌కు మంచి పరీక్ష అయి ఉండేదని అభిప్రాయపడ్డాడు. 'వైభవ్ సూర్యవంశీ అది కచ్చితంగా గొప్ప పరీక్ష అయి ఉండేది. అది అతని మానసిక బలానికి, సామర్థ్యానికి ఒక సవాలుగా నిలిచేది. వైభవ్‌కు మంచి ఐసైట్‌తో పాటు బంతిని బాదే అద్భుతమైన సామర్థ్యం ఉంది. కాబట్టి మా బౌలర్లతో పోరు ఆసక్తికర మ్యాచ్ అయి ఉండేది.’అని లాయిడ్ చెప్పుకొచ్చాడు.

పైలం పిలగా.. సచిన్‌కే తప్పలేదు: సౌతాఫ్రికా దిగ్గజం వార్నింగ్

పైలం పిలగా.. సచిన్‌కే తప్పలేదు: సౌతాఫ్రికా దిగ్గజం వార్నింగ్

అంపైర్లకు ఫిర్యాదు చేయాలి..

శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవపడటాన్ని లాయిడ్ తప్పుబట్టాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడే కంటే అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'మైదానంలో స్లెడ్జింగ్, వాగ్వదాలు సహజమే అయినా ఆట సమగ్రత ముఖ్యం. ప్రత్యర్థులు రెచ్చగొడితే ఆటగాళ్లు తొందరపడకుండా అంపైర్లకు ఫిర్యాదు చేయాలి. మ్యాచ్ రిఫరీలు కూడా కఠినంగా వ్యవహరించి జరిమానాలు విధించాలి. వైభవ్ సూర్యవంశీ కూడా ప్రత్యర్థి ఆటగాడితో గొడవపడకుండా అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సింది." అని లాయిడ్ అభిప్రాయపడ్డాడు. వివాదాలకు దూరంగా ఉంటే వైభవ్ సుదీర్ఘ కెరీర్‌ను నిర్మించుకోగలడని, ఈ యువ సంచలనాన్ని బీసీసీఐ సరైన దిశలో నడిపించాలని ఆకాంక్షించాడు.

భారత్-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా ఫైనల్లో అసలు సిసలు ఆటతో చెలరేగాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేసి తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వైభవ్ విధ్వంసంతో భారత్ ఏకపక్ష విజయాన్ని అందుకొని టైటిల్‌ను ముద్దాడింది.

Story first published: Tuesday, June 23, 2026, 17:34 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+