For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేయసితో నికోలస్ పూరన్ నిశ్చితార్థం.. మొకాలిపై కూర్చొని రింగ్ పెట్టిన పంజాబ్ హిట్టర్!

West Indies cricketer Nicholas Pooran gets engaged with girlfriend Alyssa Miguel

జమైకా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్‌తో ఈ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హిట్టర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని పూరనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మొకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోకు 'ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇక పూరన్ నిశ్చితార్థం తెలుసుకున్న యావత్ క్రికెట్ ప్రేమికులు ఈ జోడీకి విషెస్ తెలియజేస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ జాసన్ హోల్డర్, పరిమిత ఓవర్ల సారథి కీరన్ పొలార్డ్ పూరన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. 'కంగ్రాట్స్ నిక్కీ' అని కుంబ్లే కామెంట్ చేయగా.. 'ప్రేమ స్వచ్చమైనది, ఇద్దరికి అభినందనలు' అంటూ హోల్డర్ రాసుకొచ్చాడు. ఇక పొలార్డ్ 'ది ప్రొఫెషనల్ కంగ్రాట్స్'అంటూ కామెంట్ చేశాడు. అభిమానులు, కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లు కూడా పూరన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు.

గత కొంత కాలంగా పూరన్, మిగ్యూల్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఐపీఎల్ సందర్భంగా కూడా మిగ్యూల్.. పూరన్‌తో వచ్చింది. వాస్తవానికి వీరికి ఇప్పటికే పెళ్లి అయిందని చాలా మంది భ్రమపడ్డారు.

West Indies cricketer Nicholas Pooran gets engaged with girlfriend Alyssa Miguel

ఈ సీజన్ ఐపీఎల్‌లో పూరన్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సూపర్ విక్టరీలు అందించాడు. జట్టు ప్లే ఆఫ్స్ చేరకున్నా.. తమదైన ఆటతో అభిమానులను అలరించారు. ఇక పూరన్ ఆపిన ఓ సిక్స్ యావత్ క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్‌గా నిలిచిపోయింది. సచిన్ లాంటి దిగ్గజ క్రికెటర్లను సైతం సంభ్రమశ్చర్యానికి గురిచేసింది.

West Indies cricketer Nicholas Pooran gets engaged with girlfriend Alyssa Miguel
Story first published: Tuesday, November 17, 2020, 11:23 [IST]
Other articles published on Nov 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+