వెస్టిండీస్ క్రికెటర్‌పై రేప్ కేస్.. 11 మంది మహిళలు ఫిర్యాదు!
వెస్టిండీస్ క్రికెటర్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు రావడం కలకలం సృష్టించింది. 11 మంది మహిళలు ఓ వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గయానా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అయితే ఆ ఆటగాడు ఎవరా? అనే వివరాలను వెల్లడించలేదు. సదరు ప్లేయర్.. ఓ యువతితో పాటు 11 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం(2023) బైర్బెస్‌లోని న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌లో సదరు ఆటగాడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని 18 ఏళ్ల యువతి, ఆమె కుటుంబం ఆరోపించింది. కేసును నీరుగార్చేందుకు సదరు ఆటగాడు ప్రయత్నించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు యువతి ఫిర్యాదుతో మరికొంత మంది మహిళలు కూడా ఇలాంటి ఆరోపణలతోనే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. సదరు క్రికెటర్ పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్, వాయిస్ నోట్స్‌తో పాటు పలు ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆరోపణలు, బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదు గురించి తమకు తెలియదని, ఈ విషయమై ఇప్పుడే తాము ఏమీ మాట్లాడలేమని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షాలో మీడియాకు వివరించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఈ ఆరోపణలు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు ఆటగాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.
మైదానంలో ఓ రాక్షసుడు తిరుగుతున్నాడని గయానాకు చెందిన వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. అతను గయానాకు చెందిన ఆటగాడని అంచనా వేస్తున్నారు. గతేడాది జనవరిలో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆ క్రికెటర్ ఆడినట్లు ఓ లాయర్ తెలిపారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన సమయంలో అతనికి ఘన స్వాగతం కూడా లభించిందని హింట్ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications