Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ కొంపముంచిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. చేజారిన వరల్డ్ రికార్డ్!

బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపాడు. బంతితో పాటు బ్యాట్‌తో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్ట్‌లోనూ ఐదు వికెట్లు తీసాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు.

ఈ క్రమంలో అతను శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ వరల్డ్ రికార్డ్‌ను సమం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఆటగాడిగా.. ముత్తయ్య మురళీధరణ్‌తో కలిసి అశ్విన్ సమంగా నిలుచున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్నారు. మరోసారి అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిస్తే.. ముత్తయ్య మురళీధరణ్‌ను అధిగమిస్తాడు.

West Indies Cricket Administrative Blunder Denied Ravichandran Ashwin Massive World Record

వాస్తవానికి అశ్విన్.. తాజా అవార్డుతోనే ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయాలి. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యంతో చేసిన పనికారణంగా ఈ ప్రపంచ రికార్డ్‌ను అశ్విన్ అందుకోలేకపోయాడు.

గతేడాది టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా అశ్విన్ 15 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇవ్వలేదు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ అవార్డు ఇవ్వలేకపోయాడు. ఈ టోర్నీకి స్పాన్సర్ చేసిన భారత కంపెనీ.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వలేదని వెస్టిండీస్ బోర్డు తెలిపింది.

కానీ కమర్షియల్ కార్యక్రమాల వరకే తమ బాధ్యత ఉంటుందని, అవార్డులు బోర్డు చూసుకోవాల్సిందేనని సదరు కంపెనీ స్పష్టం చేసింది. దాంతో ఈ సిరీస్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లేకుండా పోయింది. ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చి ఉంటే అశ్విన్‌నే వరించేది. అతనికి పోటీగా యశస్వి జైస్వాల్ మాత్రమే 266 పరుగులు చేశాడు. మరే బౌలర్ కూడా 7 వికెట్లు పడగొట్టలేదు.

అశ్విన్‌కు అప్ప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చి ఉంటే తాజా అవార్డుతో అతను ముత్తయ్య మురళీధరణ్ రికార్డును అధిగమించేవాడు.

Story first published: Thursday, October 3, 2024, 21:29 [IST]
Other articles published on Oct 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+