ఇదెక్కడి బౌలింగ్ యాక్షన్..రా అయ్యా.. బుమ్రా కూడా పిల్ల బచ్చానే! (వీడియో)
న్యూఢిల్లీ: క్రికెట్‌లో విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది తమ విభిన్నమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు గొప్ప బౌలర్లుగా సక్సెస్ అయ్యారు. శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, భారత్ యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, అఫ్టానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఇదే జాబితాలోకి వస్తారు.
అయితే వీరికి తాతాలాంటి విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో ఓ ఆటగాడు బౌలింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సదరు బౌలర్ బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బౌలర్ వినూత్న బౌలింగ్ యాక్షన్‌కు బిత్తరపోయిన బ్యాటర్ క్లీన్ బౌల్డ్ కావడం కొసమెరుపు.

అయితే ఇది ఎక్కడ ఏ టోర్నీలో జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. కానీ పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ టెన్నిస్ బాల్ టోర్నీలో ఓ ఫాస్ట్ బౌలర్ తన చేతి వినూత్నంగా తిప్పి వేయగా.. తికమకకు గురైన బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సదరు బౌలర్ తన మోచేతిని 90 డిగ్రీలు వంచుతున్నాడని, ఇది ఇల్లిగల్ యాక్షన్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ బౌలర్ ముందు బుమ్రా, మలింగా కూడా పిల్ల బచ్చాలని సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ బౌలింగ్ చూసిన తర్వాత నా మోచేతి విరిగిందని భయపడ్డానని ఓ ట్విటర్ యూజర్ కామెంట్ చేయగా.. ముత్తయ్య మురళీదరణ్ మీడియా పేసర్ అయితే అతని యాక్షన్ ఇలానే ఉండదని మరొకరు కామెంట్ చేశారు. ఇక ముత్తయ్య మురళీదరణ్‌కు పోలియే వచ్చి బౌలింగ్ చేస్తే యాక్షన్ ఇలానే ఉంటుందని సెటైర్లు పేల్చుతున్నారు.
గతంలోనూ వినూత్నమైన బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications