Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: నా వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్ యాదవ్

రాంగ్ టైమ్‌లో తాను ఔటవ్వడమే తమ పతనాన్ని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో 15-20 పరుగులు అదనంగా చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. పిచ్ స్లోగా ఉన్నా ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ముఖ్యం సమీర్ రిజ్వీ తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడని, ఢిల్లీ బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు.

ఈ గెలుపు క్రెడిట్.. రిజ్వీదే

'ఈ పిచ్ బాగుంది. అయితే ఇది నెమ్మదిగా ఉంటుందని మేం ముందే ఊహించాం. మేం 15-20 పరుగులు తక్కువ చేశామనిపిస్తోంది. అలా అని ఢిల్లీ బౌలర్ల, సమీర్ రిజ్వీ ప్రదర్శనకు క్రెడిట్‌ ఇవ్వకుండా ఉండలేం. రిజ్వీకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అతను మమ్మల్ని మ్యాచ్‌లోకి తిరిగి రానివ్వకుండా అద్భుతంగా ఆడాడు.

We were 15-20 runs short Suryakumar Yadav Credits Sameer Rizvi for MI s Defeat Against DC in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

పిచ్ పెద్దగా మారలేదు, కానీ ఢిల్లీ ఆటగాళ్లు పరిస్థితులను బాగా అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశారు. మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు ఇది 'సరైన స్కోరు' అని చెప్పలేము. 180-185 పరుగులు ఇక్కడ మంచి స్కోరు అని మేము భావించాం. నేను, నమన్ ధీర్ రాంగ్ టైమ్‌లో ఔట్ అయ్యాం. బౌలింగ్‌లో ఇలాంటి రోజులు సహజం, మేం మళ్ళీ లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లో మరింత బలంగా తిరిగి వస్తాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. సమీర్ రిజ్వీ(51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. పాతుమ్ నిస్సంక(30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) విలువైన పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా ఇది రెండో విజయం.

Story first published: Saturday, April 4, 2026, 20:11 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+