భారత్‌కే మెదటి ప్రాధాన్యత.. 'విదేశాల్లో ఐపీఎల్' లాస్ట్ ఆప్షన్ మాత్రమే: బీసీసీఐ

ముంబై: భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిర్వహణకు ఏమాత్రం అవకాశమున్నా ఇక్కడే నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. విదేశాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమనేది బీసీసీఐ వద్ద ఉన్న చివరి ఆప్షన్ మాత్రమేనని ఆయన చెప్పారు. భారత్‌లో రోజురోజుకీ కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఈ సీజన్ విదేశాల్లోనే జరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై ధుమాల్ వివరణ ఇచ్చారు.

లాస్ట్ ఆప్షన్ మాత్రమే:
మంగళవారం బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ... 'ఏమాత్రం అవకాశమున్నా ఐపీఎల్ 2020ని భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోతే మాత్రమే విదేశాల్లో నిర్వహించడంపై ఆలోచిస్తాం. యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఐపీఎల్ ఆతిథ్యంపై తమ ప్రతిపాదనలు పంపాయి. ఒకవేళ విదేశాల్లో టోర్నీని నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించి ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తాం. మా తొలి ప్రాధాన్యత భారత్‌కే, విదేశాల్లో నిర్వహణ అనేది ఆఖరి ప్రత్యామ్నాయం మాత్రమే' అని తెలిపారు.

ప్రపంచకప్ వాయిదా పడితే:
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే వేదిక ఎక్కడ అన్నది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైరస్ పరిస్థితి, లాజిస్టిక్స్ అవసరాలను బట్టి వేదికను నిర్ణయించాల్సి ఉంటుంది.

ఆతిథ్యమిచ్చేందుకు మూడు దేశాలు సిద్ధం:
భారత్‌లో వైరస్ వ్యాప్తి రోజురోజుకు పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబరు చివరి నాటికి కూడా పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు అస్సలు కనిపించడం లేదు. దాంతో భారత్ వెలుపలే ఐపీఎల్‌ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ క్యాచ్ రిచ్ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని శ్రీలంక, యూఏఈ, న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం భారత్‌కే మెదటి ప్రాధాన్యత అని, విదేశాల్లో ఐపీఎల్ లాస్ట్ ఆప్షన్ మాత్రమే అని అంటోంది. మరి ఎం జరుగుతుందో చూడాలి.

రెండుసార్లు భారత్ వెలుపల మ్యాచ్‌లు:
గతంలో రెండుసార్లు భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై, 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. దీంతో మరోసారి ఐపీఎల్ ఆతిథ్య అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతుండగా.. శ్రీలంక తమ దేశంలో వైరస్ కేసులు తక్కువగా నమోదవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌లో కూడా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గింది. మొత్తానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మూడు దేశాలు సిద్ధంగా ఉన్నాయి.
'తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా.. నా జీవితంలో అది గుర్తుండిపోతుంది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications